T20 World Cup 2022: ముగిసిన క్వాలిఫయర్స్.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో తొలి అంకం ముగిసింది. శనివారం నుంచి అసలు సిసలు సూపర్ 12 పోరు షురూ కానుంది. క్వాలిఫయర్స్ రౌండ్‌లో పోటీపడిన 8 జట్ల నుంచి నాలుగు టీమ్స్ సూపర్ టీమ్స్‌కు అర్హత సాధించాయి. రెండు గ్రూప్‌లుగా నిర్వహించిన క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ప్రధాన మ్యాచ్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా అభిమానులకు కావాల్సిన మజాను అందించాయి. పసికూనలు అనుకున్న జట్లే రెండు సార్లు చాంపియన్ అయిన వెస్టిండీస్‌ను మట్టికరిపించాయి. గ్రూప్ ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ అర్హత సాధించగా.. గ్రూప్ బీ నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ క్వాలిఫై అయ్యాయి.
గత టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 12 జట్లలో ఈసారి వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు లేవు. వాటి బదులు నెదర్లాండ్స్, జింబాబ్వే కొత్తగా వచ్చి చేరాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే సూపర్-12లో ఉంది. గత టోర్నీలో బంగ్లాదేశ్ అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.
ఏ జట్టు.. ఏ గ్రూప్‌లో ఉందంటే..?
ఆరేసి జట్లతో సూపర్ -12లో రెండు గ్రూప్‌లు సిద్ధమైపోయాయి. టైటిల్ కోసం మొత్తం పన్నెండు జట్లు తలపడతాయి. భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22న జరిగే తొలి మ్యాచ్‌తో సూపర్ -12 పోరు మొదలుకానుంది.
గ్రూప్ 1- న్యూజిలాండ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్
గ్రూప్ 2 - సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే
భారత షెడ్యూల్..
అక్టోబర్ 23 : ఇండియా - పాకిస్తాన్
వేదిక : మెల్‌బోర్న్, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అక్టోబర్ 27 : ఇండియా - నెదర్లాండ్స్
వేదిక : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మ్యాచ్ టైం : మధ్యాహ్నం 12.30 నుంచి
అక్టోబర్ 30 : ఇండియా - సౌతాఫ్రికా
వేదిక : పెర్త్ స్టేడియం. మ్యాచ్ టైం : సాయంత్రం 4.30 నుంచి
నవంబర్ 02 : ఇండియా - బంగ్లాదేశ్
వేదిక : అడిలైడ్ ఓవల్. మ్యాచ్ టైం : మధ్యాహ్నం 1:30 నుంచి
నవంబర్ 06 : ఇండియా - జింబాబ్వే
వేదిక : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్. మ్యాచ్ టైం : మధ్యాహ్నం 1.30 నుంచి..

లైవ్ ఏ చానెల్‌లో అంటే..?
భారత్ తో సహా టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌లన్నీ స్టార్ నెట్వర్క్‌కు చెందిన చానెల్స్‌తో పాటు డిస్నీ హాట్ స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. స్టార్ స్పోర్ట్స్1, 2, 3 తోపాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు, కన్నడ, తమిళం, మళయాళంలోకూడా మ్యాచ్‌లను చూడొచ్చు. ఇక భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా చూడవచ్చు.

ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం..
టీ20 ఫార్మాట్‌లో ఫలితం ఏ క్షణానైనా మారొచ్చు. బంతుల వ్యవధిలోనే ఫలితం తారుమారవుతోంది. కాబట్టి విజేతలను అంచనా వేయడం కష్టం. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా మూడు విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతోంది. స్టార్ ప్లేయర్లు ఉన్నంతమాత్రాన గెలుపు దరిచేరదు. అయితే ప్రస్తుతం ఉన్న రెండింటిలో కాస్త సులువుగా అంచనా వేయగల గ్రూప్.. భారత్ ఉన్న గ్రూప్-2. ఎందుకంటే ఇందులో మన టీమ్‌తోపాటు సౌతాఫ్రికా, పాకిస్థాన్ బలమైనవి కాగా.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లను కాస్త అలవోకగానే ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇక గ్రూప్ -1లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చాలా కఠిన ప్రత్యర్థులు.. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక షాక్‌లు ఇచ్చే జట్లు. ప్రత్యేకంగా లంక పట్ల ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. క్వాలిఫయిర్‌లో కీలక సమయంలో రాణించి అర్హత సాధించింది. అలాగే గత ఆసియా కప్ విజేత కూడా శ్రీలంక అనే విషయాన్ని ఇతర జట్లు మరువకూడదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications