T20 World Cup 2022: జింబాబ్వే చేతిలో ఓటమి.. పాకిస్థాన్ సెమీస్ చాన్స్ ఇలా.. భారత్‌పైనే ఆ జట్టు ఆశలన్నీ..!

హైదరాబాద్: ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో బరిలోకి దిగిన పాకిస్థాన్.. వరుస పరాజయాలతో తడబడుతోంది. టీమిండియాతో తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్న ఆ జట్టు.. పసికూన జింబాబ్వే చేతిలో కూడా ఓటమిపాలైంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడటంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దాదాపు ఇంటిదారి పట్టే పరిస్థితి తెచ్చుకున్న ఆ జట్టు.. షెడ్యూల్ ప్రకారం మిగతా మ్యాచ్‌లు ఆడనుంది. అద్బుతం జరిగితే తప్పా.. ఆ జట్టు సెమీస్ చేరే అవకాశం లేదు.

సెమీస్ చేరాలాంటే..
గతేడాది వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన పాక్.. ఈ సారి మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయింది. గ్రూప్-2లో ఉన్న పాకిస్థాన్ వరుస పరాజయాలతో పాటు దారుణమైన నెట్ రన్‌రేట్(-0.050) కారణంగా ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్(అక్టోబర్ 30), సౌతాఫ్రికా (నవంబర్ 3), బంగ్లాదేశ్ (నవంబర్ 6)తో తలపడనుంది. పాక్ సెమీస్ చేరాలంటే ముందు ఈ మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించాలి. రన్‌రేట్‌ను మెరుగయ్యే విధంగా ఈ విజయాలుండాలి.

మూడింటికి మూడు గెలిచినా..
ఈ మూడు మ్యాచ్‌లు గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై పాక్ ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్-2 టాపర్‌గా ఉన్న టీమిండియా చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలి. వచ్చే ఆదివారం ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత్‌పైనే పాక్ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడితో సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ వర్షం రద్దవ్వడంతో సౌతాఫ్రికా ఖాతాలో ఒకే పాయింట్ రాగా.. భారత్ చేతిలో ఓడి, పాక్ చేతిలో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సౌతాఫ్రికానే కాకుండా జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవాలి.

బంగ్లాదేశ్ సైతం..
బంగ్లాదేశ్ కూడా రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. ఆ జట్టు తర్వాత మ్యాచ్ లు పాకిస్తాన్, జింబాబ్వే, ఇండియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో ఫలితాలు కూడా పాకిస్థాన్ జట్టు భవితవ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇన్ని సమీకరణాలు పాక్‌కు అనుకూలంగా జరగాలంటే కష్టమే. అద్భుతం జరిగితే తప్పా పాక్‌ను రక్షించేటోడు లేడు. వరుసగా రెండు విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్ రేసులో ముందంజలో ఉంది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో ఆడనుంది. ఈ మూడింటిలో సౌతాఫ్రికా ఒక్కటే కష్టమైన ప్రత్యర్థి. ఆ జట్టు చేతిలో టీమిండియా ఓడినా పెద్ద ప్రభావం ఉండదు. కానీ వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్ గెలిచేందుకే రోహిత్ సేన ప్రయత్నించాలి.

సెమీస్ చేరలేం - నిజాయితీగా చెబుతున్నా..
ఈ క్రమంలోనే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలపై ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. సెమీస్ చేరడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. తాను ఈ విషయాన్ని నిజాయితీగా చెబుతున్నానని పేర్కొన్నాడు. సెమీస్ చేరే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు. టోర్నమెంట్‌లో ముందడుగు వేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉందని, దాని కోసం కష్టపడుతున్నామని, వరుస ఓటములు తమను నిరాశకు గురి చేశాయనే విషయాన్ని తాను అంగీకరిస్తోన్నానని బాబర్ ఆజమ్ వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications