Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటే నన్ను ఆల్‌రౌండర్‌గా నిలబెట్టింది: హార్దిక్ పాండ్యా

T20 World Cup 2022: Hardik Pandya says MS Dhoni’s one advice can’t forget

బ్రిస్బేన్: బ్యాటింగ్ చేసేటప్పుడు వ్యక్తిగత స్కోర్‌ను కాకుండా జట్టు స్కోర్‌ను చూసి ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ చెప్పడం తనకింకా గుర్తుకు ఉందని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ ఒక్క మాట తన బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికీ బ్యాటింగ్ చేసేటప్పుడు ధోనీ చెప్పిన ఆ మాట తనకు గుర్తుకు వస్తూనే ఉంటుందని తెలిపాడు. ఈ సలహానే తనను ఆల్‌రౌండర్ నిలబెట్టిందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న హార్దిక్.. టైటిలే లక్ష్యంగా సన్నదమవుతున్నాడు. జట్టుకు కీలక విజయాలందించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకం కానున్న హార్దిక్‌పై భారీ అంచనాలున్నాయి.

 ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో..

ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో..

తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రొమోను స్టార్ స్పోర్ట్స్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ధోనీతో తనకు ఉన్న అనుబంధాన్ని హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా ఎదగడానికి ధోనీ ఎలా సహకరించాడో వెల్లడించాడు. 'బ్యాటింగ్ చేసేటప్పుడు స్కోర్ బోర్డును చూస్తూ ఆడాలి. జట్టు ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోని దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అంతేకానీ వ్యక్తిగత స్కోర్‌ను చూస్తూ ఆడితే ప్రయోజనం ఉండదని ధోనీ చెప్పాడు. ఈ ఒక్క మాట నాకింకా గుర్తుంది.'అని తెలిపాడు.

క్రికెటే నాకున్న ఏకైక మార్గం..

ఇక తన జీవితంలో క్రికెట్ ఎంత ముఖ్యమైనదో కూడా పాండ్యా వెల్లడించాడు. 'నా జీవితం మారడానికి నాకు ఉన్న ఏకైక మార్గం క్రికెట్. నా జీవితంలో ఉన్న లక్ష్యం కూడా ఇదే. ఏదైనా సాధించాలంటే క్రికెటర్ అయితేనే సాధ్యమని గట్టిగా నమ్మాను'అని హార్దిక్ తెలిపాడు. హార్దిక్, ధోనీ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీతోనే కాదు అతని కుటుంబంతో హార్దిక్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ధోనీ హయాంలో హార్దిక్ ఓ వెలుగు వెలిగాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయాలతో సతమతమయ్యాడు. గత టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా.. అనంతరం ఆటకు బ్రేక్ ఇచ్చి ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు.

హార్దిక్‌పై భారీ అంచనాలు..

హార్దిక్‌పై భారీ అంచనాలు..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపి తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. గుజరాత్‌కు టైటిల్ కూడా అందించాడు. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి అదే ఫామ్‌ను కొనసాగించాడు. దాంతో హార్దిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవాలంటే హార్దిక్ రాణించడం చాలా కీలకం. ముఖ్యంగా ఆసీస్ వికెట్లపై పేస్ బౌలర్లది కీలక పాత్ర. బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న హార్దిక్ అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లో చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు.

Story first published: Tuesday, October 18, 2022, 19:45 [IST]
Other articles published on Oct 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+