Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం.. రసవత్తరంగా సెమీఫైనల్ రేసు!

T20 World Cup 2022 Group 2 Qualification Scenario After Team India beat Bangladesh

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుతం చేసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలవగా.. పాకిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి.

సౌతాఫ్రికా‌కు అవకాశం ఉండగా.. బంగ్లాదేశ్‌కు అవకాశం ఉంది. నెదర్లాండ్స్, జింబాబ్వే ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి. ప్రస్తుతం టీమిండియా 6 పాయింట్లతో గ్రూప్2లో అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా 5 పాయింట్లు(2 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు)తో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. జింబాబ్వే(3), పాకిస్థాన్(2), నెదర్లాండ్స్(2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గ్రూప్2 నుంచి భారత్, సౌతాఫ్రికాకు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అద్భుతం జరిగితే బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నాకౌట్ చేరవచ్చు. భారత్ ఆదివారం జింబాబ్వేతో జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణం లేకుండా సెమీఫైనల్ చేరుతుంది. రద్దయినా రోహిత్ సేనకు వచ్చే ఇబ్బందే లేదు. కానీ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా సఫారీ టీమ్ సెమీస్ బెర్త్ ఖారారు అవుతుంది. అలా కాకుండా రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ రేసులోకి వస్తాయి. ఈ రెండు రద్దయినా సఫారీ టీమ్‌కు వచ్చే నష్టం లేదు.

భారత్ చేతిలో ఓడినా బంగ్లాదేశ్‌కు సెమీఫైనల్ అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు భారీ విజయం సాధించి.. సౌతాఫ్రికా తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఓడితే షకీబ్ అల్ హసన్ జట్టుకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా విజయం సాధిస్తే ఈ సమీకరణాలే అవసం లేదు. భారత్‌తో కలిసి ఆ జట్టు సెమీస్‌కు దూసుకెళ్తుంది.

పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. సౌతాఫ్రికాతో పాటు బంగ్లాదేశ్‌ను ఆ జట్టు భారీ తేడాతో ఓడించాలి. సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌తో కూడా ఓడిపోవాలి. అప్పుడు పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ సఫారీ నెదర్లాండ్స్‌తో గెలిచినా.. జింబాబ్వే చేతిలో భారత్ చిత్తుగా ఓడాలి. అప్పుడు పాక్‌కు మెరుగైన రన్ రేట్ ఉంటే భారత్‌ను వెనక్కునెట్టి సెమీస్ చేరుతోంది. ఇవన్నీ జరగడం చాలా కష్టం. కాబట్టి సౌతాఫ్రికా, భారత్‌కే సెమీస్ చేరే అవకాశాలున్నాయి.

Story first published: Wednesday, November 2, 2022, 22:01 [IST]
Other articles published on Nov 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+