Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: సెమీస్ రేసులో పాకిస్థాన్.. డేంజర్ జోన్‌లో సౌతాఫ్రికా! భారత్ పరిస్థితి ఏంటంటే..?

 T20 World Cup 2022 Group 2 Qualification Scenario After Pakistan beat South Africa

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022‌ రసవత్తరంగా సాగుతోంది. సూపర్ 12 ముగింపు దశకు చేరినా.. ఇంకా 6 మ్యాచ్‌లే మిగిలే ఉన్నా.. ఒక్క జట్టు కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. గ్రూప్-1తో పాటు గ్రూప్-2లోనూ సెమీస్ బెర్త్ కోసం ఆయా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టు ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఏ జట్టు కూడా అజేయంగా నాకౌట్‌కు వెళ్లడం లేదు. ఇక గురువారం సౌతాఫ్రికాను భారీ తేడాతో ఓడించిన పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ విజయంతో సఫారీ టీమ్ డేంజర్ జోన్‌లో పడింది. మరోవైపు భారత్ కూడా జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రూప్-2లో 6 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. పాకిస్థాన్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. జింబాబ్వే(3), నెదర్లాండ్స్(2) సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.

పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు..

పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తప్పనిసరి గెలవాలి. రన్‌రేట్ మెరుగయ్యేలా ఈ గెలుపు ఉండాలి. అంతేకాకుండా సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా.. వర్షంతో రద్దయినా పాకిస్థాన్ సెమీస్ చేరుతోంది. సౌతాఫ్రికా ఇంటిదారిపడుతోంది. సౌతాఫ్రికా నెట్ రన్‌రేట్ కంటే పాకిస్థాన్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక జింబాబ్వే చేతిలో భారత్ ఓడినా పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఎందుకంటే భారత్ కంటే పాకిస్థాన్‌కే మెరుగైన రన్‌రేట్ ఉంది.

బంగ్లాదేశ్ సెమీస్ చేరాలంటే..

బంగ్లాదేశ్ సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తప్పనిసరి గెలవాలి. రన్‌రేట్ మెరుగయ్యేలా ఈ గెలుపు ఉండాలి. అంతేకాకుండా సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడాలి. వర్షంతో రద్దయితే బంగ్లాదేశ్ రన్ రేట్ కీలకం అవుతోంది. కానీ సౌతాఫ్రికా కంటే బంగ్లాదేశ్ రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది.

కాబట్టి నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడితేనే బంగ్లాకు అవకాశం ఉంటుంది. ఇక జింబాబ్వే చేతిలో భారత్ ఓడినా.. బంగ్లాదేశ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటేనే అవకాశం దక్కుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా ఓడిపోవడమే ఆ జట్టుకు కావాలి.

సేఫ్ సైడ్ భారత్..

సేఫ్ సైడ్ భారత్..

భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడిస్తే ఏ జట్టు సంబంధం లేకుండా సెమీస్ చేరుతోంది. వర్షంతో మ్యాచ్ రద్దయినా ఏడు పాయింట్లతో ముందడుగువేస్తోంది. ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా, పాకిస్థాన్ కంటే రన్‌రేట్ తక్కువగా ఉండటం టీమిండియాను ఇబ్బంది పెట్టే అంశం.

డేంజర్ జోన్‌లో సౌతాఫ్రికా

డేంజర్ జోన్‌లో సౌతాఫ్రికా

నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా విజయం సాధిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతోంది. కానీ వర్షంతో ఈ మ్యాచ్ రద్దయినా.. ఓడినా ఆ జట్టు ఇంటి బాట పడుతోంది. ఎందుకంటే ఆ జట్టు ప్రస్తుతం 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రద్దయితే ఒక పాయింట్ ఖాతాలో చేరుతుంది. కానీ పాకిస్థాన్ కంటే ఆ జట్టు రన్ రేట్ తక్కువగా ఉంది. అదే సమయంలో భారత్.. జింబాబ్వేతో ఓడితే మాత్రం సౌతాఫ్రికాకు అవకాశం ఉంటుంది.

Story first published: Thursday, November 3, 2022, 19:59 [IST]
Other articles published on Nov 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+