T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు ముప్పు తెచ్చిన న్యూజిలాండ్ ఓటమి! రసవత్తరంగా సెమీఫైనల్ రేసు..!

బ్రిస్బేన్: సుబ్బి పెళ్ళి ఎంకి చావుకి వచ్చినట్లుంది టీ20 ప్రపంచకప్ 2022లో ఆతిథ్య ఆస్ట్రేలియా పరిస్థితి. మంగళవారం జరిగిన గ్రూప్-1 కీలక పోరులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో గెలుపొంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మెరుగవ్వగా.. ఆస్ట్రేలియాకు కొత్త కష్టం తెచ్చిపెట్టింది. అటు న్యూజిలాండ్ సైతం ఈ అనూహ్య పరాజయంతో సునాయసంగా సెమీస్ చేరలేని పరిస్థితి తెచ్చుకుంది. వర్షం కారణంగా గ్రూప్-1లో మూడు మ్యాచ్‌లు రద్వవ్వడం.. ప్రధాన జట్లు న్యూజిలాండ్, ఆసీస్, ఇంగ్లండ్ పోటాపోటీగా తలపడుతుండటంతో గ్రూప్-1 సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది.
న్యూజిలాండ్ టాప్‌లో ఉన్నా..
ప్రస్తుతానికి 4 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ ఐదు పాయింట్లు(రెండు విజయాలు, ఒక ఓటమితో పాటు ఒక మ్యాచ్ రద్దు)తో గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ సైతం (రెండు విజయాలు, ఒక ఓటమితో పాటు ఒక మ్యాచ్ రద్దు) 5 పాయింట్లతోనే రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కూడా అన్నే పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ విజయాన్నందుకోవడంతో ఆ జట్టు రన్‌రేట్(2.233) మెరుగ్గా ఉండటంతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రన్ రేట్(-0.304) నెగటీవ్‌గా ఉండటం ఆ జట్టును కలవరపెడుతోంది. నాలుగు, ఐదో స్థానంలో ఉన్న శ్రీలంక, ఐర్లాండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి.
ఓడితే ఇంటికే..
ఎలాంటి సమీకరణాలు లేకుండా న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరాలంటే శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు తప్పనిసరిగా గెలవాలి. గెలవడమే కాదు సేఫ్ సైడ్‌గా మెరుగైన రన్‌రేట్ అందుకోవాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడినా.. వర్షంతో రద్దయినా ఆ జట్టు సెమీస్ అవకాశాలు గల్లంతయినట్లే. రద్దయితే కివీస్ ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు ఆ జట్టు సెమీఫైనల్ చేరాలంటే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో ఒకటి రద్దవ్వాలి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ కారణంగా కివీస్ టోర్నీలో ముందడుగు వేస్తుంది.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియాది అదే పరిస్థితి..
ఇక ఇంగ్లండ్ కూడా శ్రీలంకతో శనివారం జరిగే మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో ఓడినా రద్దయినా.. ఆ జట్టు కథ ముగిసినట్లే. ఆస్ట్రేలియా.. అఫ్గానిస్థాన్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలి. దాదాపు 100 + పరుగుల తేడాతో విజయం సాధిస్తే ఆ జట్టు సెమీస్ చేరుతుంది. ఓడినా.. మ్యాచ్ రద్దయినా ఆ జట్టు కథ ముగుస్తుంది. ఒక వేళ సాధారణ విజయం సాధిస్తే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో ఒక జట్టు ఓడిపోతే అవకాశం ఉంటుంది. మొత్తానికి గ్రూప్-1 సెమీఫైనల్ బెర్త్‌లు చిన్న దేశాలు, వర్షంతో పాటు రన్‌రేట్‌పై ఆధారపడి ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications