For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: 3 మ్యాచ్‌లు గంగపాలు.. గందరగోళంగా గ్రూప్ 1.. సెమీస్ చాన్స్ ఎవరికంటే..?

T20 World Cup 2022 Group 1 Qualification Scenario After Aus vs Eng Match Called Off

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌ 2022లో వర్షం ఆధిపత్యం కొనసాగుతోంది. వరణుడు దిగ్విజయంగా నాలుగో మ్యాచ్‌ను మింగేసాడు. శనివారం ఒక్కరోజే రెండు మ్యాచ్‌లను రద్దు చేయించాడు. ఆస్ట్రేలియా X ఇంగ్లండ్ బిగ్ మ్యాచ్‌తో పాటు అఫ్గానిస్థాన్ X ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతిపడకుండానే రద్దయ్యాయి. మెల్ బోర్న్ వేదికగానే జరగాల్సిన ఈ రెండు మ్యాచ్‌లు వర్షానికి తోడు నిర్వాహకులు అలసత్వం కారణంగా జరగలేకపోయాయని క్రికెట్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

గందరగోళంగా గ్రూప్-1

ఏది ఏమైనా ఈ ప్రపంచకప్‌ను వర్షం శాసిస్తోందని, ఇలా వర్షం కారణంగా ఇన్ని మ్యాచ్‌లు రద్దవ్వడం ఇదే తొలిసారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒక్క గ్రూప్-1లోనే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవ్వడంతో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఐర్లాండ్ వంటి చిన్న దేశాలకు మార్గం సుగుమమైంది. మూడు మ్యాచ్‌లు రద్దవ్వడంతో గ్రూప్-1లో మూడు జట్లు ఏడేసి పాయింట్లతో సూపర్ 12ను ముగించే అవకాశం ఉంది. దాంతో సెమీస్ చేరే జట్లు మెరుగైన రన్ రేట్ సాధించడం కీలకమైంది.

టాప్‌లో న్యూజిలాండ్

ప్రస్తుతం గ్రూప్ 1లో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో విజయం సాధించడంతో పాటు రద్దయిన మ్యాచ్‌ల కారణంగా మరో పాయింట్ సాధించాయి. రెండు పాయింట్లతో శ్రీలంక ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గాన్ రెండు మ్యాచ్‌లు రద్దవ్వడంతో ఆఖరి స్థానంలో ఉంది.

న్యూజిలాండ్, ఆసీస్‌కే..

మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయిన తర్వాత సెమీస్ అవకాశాలు న్యూజిలాండ్, ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. కివీస్‌కు 61 శాతం చాన్స్ ఉండగా.. ఆసీస్‌కు 37 శాతం, శ్రీలంకకు 34 శాతం ఉంది. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మూడు జట్లలో ఇంగ్లండ్‌తో కివీస్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్ రేట్‌తో రెండు గెలిచినా..కివీస్‌కు చాన్స్ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఓడినా.. రద్దయినా ఇంటిదారి పడుతుంది. ఇంగ్లండ్ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడనుండగా.. ఈ రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంది.

రేసులోకి ఆసీస్..

రేసులోకి ఆసీస్..

న్యూజిలాండ్‌తో ఘోర పరాజయంతో వెనకడుగు వేసిన ఆసీస్.. వర్షం కారణంగా అనూహ్యంగా రేసులోకి వచ్చింది. కీలక ఇంగ్లండ్‌తో నేడు ఆడాల్సిన మ్యాచ్‌ను వర్షంతో తప్పించుకున్న ఆసీస్.. తదుపరి మ్యాచ్‌ల్లో పసికూనలు ఐర్లాండ్, అఫ్గాన్‌లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే ఆసీస్‌కు తిరుగుండదు. గ్రూప్-1లో సేఫ్‌గా ఉన్న జట్టు కివీస్ అయితే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు చాన్స్ ఉంది. శ్రీలంక అనూహ్య విజయాలు సాధిస్తే రేసులోకి వస్తుంది.

Story first published: Friday, October 28, 2022, 18:14 [IST]
Other articles published on Oct 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+