Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి అంత సీన్ లేదు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతనే: గౌతమ్ గంభీర్

T20 World Cup 2022: Gautam Gambhir says Suryakumar Yadav is already Player of the Tournament for me

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యను గంభీర్ కొనియాడు. టీ20 ప్రపంచకప్ 2022లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అతన్నే వరిస్తుందని గంభీర్ జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నా.. సూర్యను వెనక్కినెట్టేంత సీన్ లేదన్నాడు. సూర్యలాంటి ఆటగాళ్లు చాలా అరుదని, అతను ప్రతీ బంతిని ఆస్వాదించి ఆడుతాడని పేర్కొన్నాడు. జింబాబ్వేతో జరిగిన చివరి సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖారారు చేసుకున్న విషయం తెలిసిందే.

సూర్య డిఫరెంట్..

సూర్య డిఫరెంట్..

ఈ మ్యాచ్ ఫలితంపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్.. సూర్యను ఆకాశానికెత్తాడు. 'టీమిండియాలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ వీళ్లంతా చాలా సంప్రదాయ ప్లేయర్లు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం విభిన్నం. అతని ఆట వేరు. ప్రతీ బంతిని ఆస్వాదిస్తూ ఆడుతాడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు చాలా అరుదు. ఇప్పటి వరకు భారత జట్టుకు అలాంటి ప్లేయర్ ఆడలేదు.

మాములు విషయం కాదు..

మాములు విషయం కాదు..

నెంబర్4లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. నిలకడగా పరుగులు చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే 180+ స్ట్రైయిక్ రేటుతో 200లకు పైగా పరుగులు... అందులో మూడు హాఫ్ సెంచరీలు చేయడం మాములు విషయం కాదు. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా నా వరకూ సూర్యకుమార్ యాదవ్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'.. అతను ఇప్పటికే తన మార్కు వేసేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో ఆడే అవకాశం ఉండదు. అయినా 180-200 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేయడమంటే మామూలు విషయం కాదు.' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

టాప్ స్కోరర్‌గా కోహ్లీ..

టాప్ స్కోరర్‌గా కోహ్లీ..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఐదు మ్యాచుల్లో 123 సగటుతో 246 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. 225 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టాప్ 3లో ఉన్నాడు. సూర్య స్ట్రైయిక్ రేటు 193.97గా ఉంటే విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు 130కి పైన ఉంది. ఇక ఇప్పటికే విరాట్ కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవే అత్యుత్తమ బ్యాటరని గంభీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ సెమీస్ చేరడంలో విరాట్, సూర్య కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బ్యాటింగ్ బాధ్యతలను ఈ ఇద్దరే తమ భుజాన మోస్తున్నారు.

సౌతాఫ్రికా పుణ్యమా..

సౌతాఫ్రికా పుణ్యమా..

జింబాబ్వేపై ఘన విజయంతో గ్రూప్-2 టాపర్‌గా భారత్, రన్నరప్‌గా పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అసలు సెమీస్ రేసులోనే లేని పాకిస్థాన్.. సౌతాఫ్రికా పుణ్యమా అంటూ అనూహ్యంగా నాకౌట్ చేరింది. నెదర్లాండ్స్ చేతిలో సఫారీలు ఓటమిపాలవ్వడం.. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలవడంతో ఆ జట్టుకు అవకాశం లభించింది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. బుధవారం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఆదివారం ఫైనల్ నిర్వహించనున్నారు. భారత్-పాక్ టైటిల్ ఫైట్‌లో తలపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Story first published: Monday, November 7, 2022, 14:00 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+