Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్‌ను ఆపడం కష్టం: గౌతమ్ గంభీర్

T20 World Cup 2022: Gautam Gambhir says KL Rahul will probably light up this tournament

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫామ్‌లోకి వచ్చిన రాహుల్‌ను ఆపడం కష్టమని చెప్పాడు. అసలు రాహుల్ ఫామ్‌ కోల్పోలేదన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో వరుసగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. బంగ్లాతో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో రాహుల్ ఇన్నింగ్స్‌పై మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏదో ఒక ఇన్నింగ్స్‌ ఆధారంగా ఒక ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయలేమన్నాడు. ఇప్పుడు ఈ ఓపెనర్‌ విషయంలోనూ అదే జరిగిందన్నాడు. 'బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అర్థశతకంతో రాహుల్‌ చెలరేగాడు. ఇప్పుడు ఈ ప్రపంచ టోర్నీలో కీలకంగా నిలుస్తాడేమో చూద్దాం. ఒక్క ఇన్నింగ్స్‌ బాగా ఆడినంత మాత్రాన అతడు గొప్ప ఆటగాడని అనలేం. బాగా ఆడలేకపోతే చెడ్డ ఆటగాడిగానూ భావించలేం. మనం వారికి కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు రాహుల్‌ ఆడిన ఆ ఒక్క షాట్‌తో అంతా మారిపోయింది. అతడిప్పుడు ఫామ్‌ అందుకున్నాడు.

నిజానికి ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నాడు. ఎంత బాగా ఆడాలనుకున్నా.. అది ప్రపంచకప్‌. ప్రపంచమంతా మీ ఆటను చూస్తుంది. మ్యాచ్‌ను సరిగా ఆరంభించలేకపోతే ఆ క్రికెటర్‌ ఆటను శంకించాల్సిన అవసరం లేదు. రాహుల్‌ ఆటతీరును ఎవ్వరూ నియంత్రించలేరు. అది తనకు మాత్రమే సాధ్యం'అని గంభీర్‌ అన్నాడు. అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్‌కే శతకం కొట్టిన రాహుల్‌ ప్రతిభ అమోఘమని భారత మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సైతం ప్రశంసించాడు. జట్టుకు అతను సుదీర్ఘకాలం పాటు ఆడతాడన్నాడు.

Story first published: Friday, November 4, 2022, 21:19 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+