For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: కోహ్లీ వేవ్‌లో కొట్టుకుపోయాయి.. కానీ ఈ తప్పిదాలపై రోహిత్ సేన ఫోకస్ పెట్టాల్సిందే!

T20 World Cup 2022: Four things Team India should improve on ahead of upcoming matches

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియా శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుణ్యాన ఓటమి నుంచి గట్టెక్కింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును విరాట్ విరోచిత పోరాటంతో విజయాన్నందించాడు. హార్దిక్ పాండ్యా సహకారంతో ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇజ్జత్ కాపాడాడు. తన అసాధారణ ఇన్నింగ్స్‌తో తాను ఎంతటి ప్రభావంతమైన ఆటగాడినో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. తానే క్రికెట్ రారాజునని ఆటతోనే తెలియజేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘోర తప్పిదాలు చేసింది. ప్రస్తుతానికి అవన్నీ కోహ్లీ వేవ్‌లో కొట్టుకుపోయినా.. మెగా టోర్నీ రోహిత్ సేన ముందుకు వెళ్లాలంటే వాటిపై సిరీయస్‌గా ఫోకస్ పెట్టాల్సిందే.

 కలవరపెడుతున్న టాపార్డర్ వైఫల్యం..

కలవరపెడుతున్న టాపార్డర్ వైఫల్యం..

కోహ్లీ లాంటి అసాధారణ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లు గెలవవచ్చు కానీ.. టైటిల్ సాధించాలంటే సమష్టి ప్రదర్శన చాలా ముఖ్యం. జట్టులోని ప్రతీ ఒక్కరూ రాణిస్తేనే విశ్వవిజేతగా నిలవవచ్చు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన బౌలింగ్ మినహా అన్ని విభాగాల్లో విఫలమైంది. బ్యాటింగ్‌ భారాన్ని కోహ్లీ ఒక్కడే మోసాడు. హార్దిక్ సహకారం అందించినా.. కీలక సమయంలో చేతులెత్తేసాడు. మ్యాచ్‌కు ముందు రోహిత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు అత్యుత్తమ బౌలింగ్ దళం ఉంటే తమకు డేంజరస్ బ్యాటింగ్ విభాగం ఉందని చెప్పాడు. కానీ తీరా మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తుస్సుమనిపించారు. పాక్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేసారు.

రాహుల్, రోహిత్, సూర్య ...

రాహుల్, రోహిత్, సూర్య ...

ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ అయితే చాలా ఒత్తిడిలో కనిపించాడు. ఆడాలా? వద్దా? అనే డబుల్ మైండ్‌సెట్‌తో వికెట్ పారేసుకున్నాడు. అతని వైఫల్యం భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన రోహిత్ సైతం బాధ్యత మరిచి వెనుదిరిగాడు. పాకిస్థాన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ప్లాన్‌ను పసిగట్టలేక మూల్యం చెల్లించుకున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న భారత్‌ను గట్టెక్కించాల్సిన సూర్యకుమార్ యాదవ్ నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రతీ ఒక్కరు సూర్యనే గేమ్ చేంజరని అంచనా వేసారు. కానీ అతను మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేశాడు. పిచ్ ప్రతికూలంగా ఉందన్నది వాస్తవమే అయినా.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఉన్నంత స్వింగ్.. భారత్ ఇన్నింగ్స్‌లో లేదనేది కూడా అంతే వాస్తవం. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు... పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిందే. ఈ టోర్నీలో భారత్ గెలవాలంటే ఈ ముగ్గురిలో ఏ ఇద్దరైనా రాణించాల్సిందే. ఈ ముగ్గురు ఔటైన తీరే అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

 కొంపముంచిన దినేశ్ కార్తీక్..

కొంపముంచిన దినేశ్ కార్తీక్..

క్రీజులో సెట్ అయిన హార్దిక్ పాండ్యా చేత్తులెత్తేస్తే.. ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ఒత్తిడికి చిత్తయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కొట్టాలని తెలియగానే దినేశ్ కార్తీక్ డగౌట్ నుంచి లేచి వాష్ రూమ్‌కు పరుగెత్తడాన్ని చూస్తేనే అతను ఎంత టెన్షన్‌కు గురయ్యాడో తెలుస్తోంది. ఇక చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన పరిస్థితిలొ వైడ్ బాల్‌ను ఆడి స్టంపౌటయ్యాడు. మరసటి బంతికి అశ్విన్ గనుక గెలిపించకపోయింటే కార్తీక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు. ఒత్తిడిని అధిగమించడంపై అతను ఫోకస్ పెట్టాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా సైతం భారీ షాట్లు ఆడటంపై ఫోకస్ పెట్టాలి. ఓవైపు కోహ్లీ ధాటిగా ఆడుతున్నా.. హార్దిక్ పాండ్యా మాత్రం ఆ ప్రయత్నం చేయలేకపోయాడు. టెన్నిస్ ఆడుతున్నట్లు బంతిని కిందకు కొట్టి తీవ్ర చికాకుకు గురి చేశాడు. కోహ్లీ స్థానంలో మరే బ్యాటర్ ఉన్నా హార్దిక్ కారణంగా ఒత్తిడికి గురై ఔటయ్యేవాడు.

చెత్త ఫీల్డింగ్.. బెడిసి కొట్టిన ద్రవిడ్ వ్యూహం.

చెత్త ఫీల్డింగ్.. బెడిసి కొట్టిన ద్రవిడ్ వ్యూహం.

.

ఈ మ్యాచ్‌ ఆరంభంలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చినా.. తమ స్లాగ్ ఓవర్ల వైఫల్యాన్ని కొనసాగించారు. ఓ దశలో పాక్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ చివరి ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చిన భారత బౌలర్లు పాక్‌కు అదనంగా 20-30 పరుగులిచ్చారు. స్లాగ్ ఓవర్లపై టీమిండియా సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇక టీమిండియా ఫీల్డింగ్ కూడా దారుణం. మూడు క్యాచ్‌లతో పాటు ఓ రనౌట్ అవకాశాన్ని చేజార్చారు. పరుగులను ఆపలేకపోయారు. ఫీల్డింగ్ కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పిచ్‌ను రీడ్ చేయడంలో కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ విఫలమైంది. పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగాల్సింది. ఎక్స్‌ట్రా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వల్ల ఉపయోగమే లేకుండా పోయింది. బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన అతను బ్యాటింగ్‌లోనూ రనౌటయ్యాడు. ఈ నాలుగు సమస్యలను రోహిత్ సేన అధిగమిస్తేనే ఫైనల్ చేరగలదు.

Story first published: Monday, October 24, 2022, 18:42 [IST]
Other articles published on Oct 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+