రెండు సార్లు టైటిల్ విన్నర్..
క్రికెట్ వెస్టిండీస్ బోర్డు సైతం వారిని పట్టించుకోకపోవడంతో జట్టు బలహీనంగా మారింది. పూర్తిగా ఆల్‌రౌండర్లతో ఉండే వెస్టిండీస్.. రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీ20 ఫార్మాట్‌లోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా గుర్తింపు పొందింది. 2012 ప్రపంచకప్‌తో పాటు 2016 టీ20 ప్రపంచకప్ టైటిల్స్‌ను ముద్దాడింది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోనీసేనను మట్టికరిపించిన విండీస్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆఖరి ఓవర్‌లో వరుస సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందుకుంది.
ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి..
అలాంటి జట్టు ఈ సారి సూపర్ 12కు కూడా అర్హత సాధించకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్ గెలిచిన జట్టు సూపర్ 12కు అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. వెస్టిండీస్ సూపర్ 12కు చేరకుండా నిష్క్రమించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అస్సలు నమ్మలేకపోతున్నామని, ఆశ్చర్యకరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసిన ఐర్లాండ్‌ను కొనియాడుతున్నారు.
బ్రాండన్ కింగ్ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలనీ మూడు వికెట్లు తీయగా.. సిమీ సింగ్, బారీ మెక్‌కార్తీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
పాల్ స్టిర్లింగ్ సూపరో సూపర్..
ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. లోర్కాన్ టకర్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ(37) కూడా పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోస్సెన్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు.
క్వాలిఫయర్స్‌లో గ్రూప్ బిలో స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్‌తో పోటీపడిన ఐర్లాండ్.. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. జింబాబ్వేతో ఓడిన ఐర్లాండ్ ఆ తర్వాత స్కాట్లాండ్, వెస్టిండీస్‌లను ఓడించింది. దాంతో గ్రూప్ బి రన్నరప్‌గా సూపర్ 12కు దూసుకెళ్లింది. గ్రూప్ బి టాపర్‌గా మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన జింబాబ్వే క్వాలిఫై అయ్యింది. స్కాంట్లాండ్‌తో ఓడిన వెస్టిండీస్.. జింబాబ్వేపై గెలిచింది. కానీ కీలక ఐర్లాండ్‌తో మాత్రం ఓటమిపాలైంది.


Click it and Unblock the Notifications












