Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: ఆ భయంతోనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నా: జోస్‌ బట్లర్

T20 World Cup 2022 Final: Jos Buttler reveals the reason why he choose to bowl against Pakistan

మెల్‌బోర్న్: పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఇది చాలా పెద్ద మ్యాచని చెప్పిన బట్లర్.. తమ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. 'అభిమానులతో మైదానం కిక్కిరిసింది. ఇది తమకు కొత్త శక్తినిస్తుంది. ఈ మ్యాచ్‌ను గొప్పగా మార్చడంపై మేం ఫోకస్ పెట్టాం. అద్భుత ఫామ్‌తో రెండు జట్లు ఫైనల్ చేరాయి. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు మేం సిద్దంగా ఉన్నాం.

ఈ వికెట్ చాలా బాగుంది. మ్యాచ్ అసాంతం ఒకేలా ఉంటుందని ఆశిస్తున్నా. ఇక వర్షం వచ్చే సూచన ఉండటంతోనే బౌలింగ్ ఎంచుకున్నా. మేం ఫ్రెష్‌గా ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగుతున్నాం. గత విజయాలతో మా ఆత్మవిశ్వాసం పెరిగినా.. అద్భుతంగా ఆడకపోతే అవి లెక్కలోకి రావనే విషయం మాకు తెలుసు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

ఇక టాస్ గెలిస్తే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. అయితే టాస్ అనేది మన చేతిలో లేదని, ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పాడు. 'స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచి ఇంగ్లండ్‌పై ఒత్తిడిని పెంచుతాం. మేం వరుస విజయాలతో జోరుమీదున్నాం. దాన్నే కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఓడినా.. మే అద్భుతంగా పుంజుకున్నాం. ఫైనల్లో కూడా అదే స్పూర్తితో బరిలోకి దిగుతున్నాం. విజయం ఎప్పుడూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. జట్టుగా మేం 100 శాతం పోరాడుతాం. 1992 చరిత్ర రిపీట్ అయ్యింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి కప్ అందుకుంటా. ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

పాకిస్థాన్: బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది

ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హరీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్

Story first published: Sunday, November 13, 2022, 13:20 [IST]
Other articles published on Nov 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+