T20 World Cup 2022: నమీబియా చేతిలో శ్రీలంక చిత్తు.. ఫన్నీమీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు!

సిడ్నీ: సంచలన ప్రదర్శనతో ఆసియాకప్ 2022 విజేతగా నిలిచిన శ్రీలంకకు టీ20 ప్రపంచకప్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు తొలి మ్యాచ్‌లోనే చిత్తయ్యింది. దాంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో శ్రీలంక టీమ్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు. అయితే.. ఆసియా కప్ 2022లో కూడా ఇలానే ఫస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన లంక.. ఆ తర్వాత విజేతగా నిలిచిన విషయాన్ని లంక అభిమానులు గుర్తు చేస్తూ కౌంటరిస్తున్నారు.
చెలరేగిన నమీబియా..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో జాన్ ప్రైలింగ్ ( 28 బంతుల్లో 4 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైపోయింది. ఆ టీమ్‌లో కెప్టెన్ డసన్ షనక (23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) మాత్రమే కాసేపు క్రీజులో నిలిచి చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై నమీబియా బౌలర్ల దెబ్బకి లంక కుదేలవడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే..
టీ20 వరల్డ్‌కప్ 2022 ప్రధాన టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక టీమ్.. గ్రూప్-ఎలో నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈతో క్వాలిఫయింగ్ రౌండ్‌లో పోటీపడుతోంది. ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12కి అర్హత సాధించనున్నాయి. అయితే.. ఇప్పటికే నమీబియా చేతిలో ఓడిపోయిన శ్రీలంక.. ఇక యూఏఈ, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ రెండింటిలోనూ గెలిస్తేనే శ్రీలంక టీమ్ సూపర్-12కి అర్హత సాధించే అవకాశం ఉంది.
పసికూన చేతిలో..
ఇక శ్రీలంకను ఓడించిన నమీబియా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా శ్రీలంకను ఓడించేందుకు టీమిండియా, పాకిస్థాన్ తడబడుతుండగా.. నమీబియా సునాయస విజయాన్నందుకుందని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. యుఏఈలో చెలరేగిన లంక ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాలో విఫలమయ్యారని కామెంట్ చేస్తున్నారు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సహా పలువురు మాజీలు నమీబియా జట్టుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమకంటే ఎంతో బలమైన శ్రీలంకను నమీబియా కట్టడి చేసిన తీరు అధ్బుతమని కితాబిస్తోన్నారు. నమీబియా క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నిలకడగా ఆడితే అగ్రజట్టుగా ఎదుగుతందని ఆకాంక్షిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications