Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: భారత్ విజయం వెనుక అన్‌సంగ్ హీరో.. ఆటగాళ్ల బూట్లను తుడిచి..

T20 World Cup 2022: Fans Praise for Unsung Hero Raghu who is clean the shoes of Indian players

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగులతో గెలుపొందింది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా.. లిటన్ దాస్ అసాధారణ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. అతని ధాటికి భారత బౌలర్లు తేలిపోయారు. ప్రతీ మ్యాచ్‌లో పవర్ ప్లేలో వికెట్లు తీసిన భారత పేసర్లు.. ఈ మ్యాచ్‌‌లో మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయారు.

వర్షం కొనసాగి ఉంటే..

అంతేకాకుండా పవర్ ప్లేలోనే ధారళంగా పరుగులిచ్చాడు. లిటన్ ధాస్ ధాటికి బంగ్లా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం రాగా.. భారత్ శిభిరంలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే అప్పటికే డీఎల్‌ఎస్ ప్రకారం బంగ్లా 17 పరుగులు ఎక్కువ చేసింది. వర్షం విరామం ఇవ్వకుండా మ్యాచ్ జరగకపోయుంటే బంగ్లాదేశ్ 17 పరుగుల తేడాతో గెలిచేది. 5 ఓవర్లు జరిగిన నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని డీఎల్‌ఎస్ పద్దతిన తేల్చేవారు.

శభాష్ రఘు..

అయితే వర్షం విరామం ఇవ్వడం.. గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని ఆటకు సిద్దం చేయడంతో అంపైర్లు 16 ఓవర్లకు కుదించి ఆటను తిరిగి ప్రారంభించారు. మైదానం కాస్త చిత్తడిగా ఉన్నా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడేందుకు తాము సిద్దమేనని చెప్పడంతో అంపైర్లు ఆటను ప్రారంభించారు. అయితే వర్షం పడిన మైదానంలో ఆడటం ఆటగాళ్లకు చాలా డేంజర్. ముఖ్యంగా ఫీల్డర్లకు తీవ్ర గాయాలయ్యే అవకాశాలుంటాయి. అయితే భారత ఆటగాళ్లు జారిపడకుండా త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు ముందస్తు చర్యలు తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు బ్రష్‌తో ఆటగాళ్లు షూస్‌ను క్లీన్ చేశాడు. షూ గ్రిప్ మధ్యలో ఉండే మట్టిని బ్రష్ సాయంతో తొలగించాడు.

నెటిజన్లు ఫిదా..

నెటిజన్లు ఫిదా..

అది తన పనికాకపోయినా.. ఆటగాళ్ల భద్రత, టీమ్ విజయమే లక్ష్యంగా భావించి ఈ పని చేశాడు. అయితే బంగ్లాపై విజయానంతరం ఎవరూ కూడా రఘు సేవలను గుర్తించలేదు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం రఘు బ్రష్ పట్టుకొని ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ టీమిండియా అన్‌సంగ్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. శభాష్ రఘూ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా వేరేవాళ్ల షూస్ తాకడానికే చాలా అవమానకరంగా భారతీయులు అవమానిస్తారని, అలాంటిది రఘు, ప్లేయర్ల భద్రత ముఖ్యమనే ఉద్దేశంతో స్టేడియమంతా కలియ తిరుగుతూ బూట్లను క్లీన్ చేశాడని కొనియాడుతున్నారు. చాలా చిన్న పనిగా అనిపిస్తున్నా, రఘు చేసిన పని వల్ల ఏ భారత ఫీల్డర్ కూడా గాయపడలేదు.

సెమీస్‌కు చేరువగా..

సెమీస్‌కు చేరువగా..

ఇక వర్షం అనంతరం రెండో బంతికే లిటన్ దాస్ రనౌట్ కావడం మ్యాచ్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్ణయించిన 151 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓడిన తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విజయం అందుకున్న టీమిండియా... సెమీస్‌కి చేరువైంది. జింబాబ్వేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా, వర్షం వల్ల డ్రా చేసుకున్నా టీమిండియా సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది.

Story first published: Thursday, November 3, 2022, 14:33 [IST]
Other articles published on Nov 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+