T20 World Cup 2022: దంచికొట్టిన డేవాన్ కాన్వే, ఫిన్ అలెన్.. ఆస్ట్రేలియా ముందు టఫ్ టార్గెట్!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 అసలు సిసలు సూపర్ 12 పోరు ఘనంగా ప్రారంభమైంది. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌండరీలతో హోరెత్తించారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో న్యూజిలాండ్ ప్రత్యర్థి ముందు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఓపెనర్ డేవాన్ కాన్వే(58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సాధించగా.. ఫిన్ అలెన్(16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో) దుమ్మురేపాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. జేమ్స్ నీషమ్(13 బంతుల్లో 2 సిక్స్‌లతో 26 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. జంపా ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ వికెట్‌పై ఈ లక్ష్యం పెద్దదేం కాదు. మరీ ఆసీస్ ఏం చేస్తుందో చూడాలి.

ఫిన్ అలెన్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ అయితే ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లనో అతను రెండు బౌండరీలు సిక్స్ బాదగా.. రెండో ఓవర్‌లో డేవాన్ కాన్వే సైతం రెండు ఫోర్లు కొట్టడంతో కివీస్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఫించ్ బౌలర్లను మార్చినా.. ఫిన్ అలెన్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. దాంతో కివీస్ 3.5 ఓవర్లలో 50 పరుగులను పూర్తి చేసుకుంది. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన ఫిన్ అలెన్‌ను హజెల్ వుడ్ సూపర్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కాన్వే హాఫ్ సెంచరీ..
అనంతరం క్రీజులోకి కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాగా.. డేవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో వపర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం జంపా బంతిని అందుకోగా.. కివీస్ పరుగుల వేగం తగ్గింది. జంపా వేసిన 13వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా బాదిన కాన్వే.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి విలియమ్సన్(23) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్(12) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.

సిక్సర్‌తో ముగింపు..
హజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో జేమ్స్ నీషమ్ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. మరోవైపు కాన్వే సైతం తన జోరును కొనసాగించాడు. 19వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి భారీ స్కోర్‌కు బ్రేక్ వేసాడు. ఆఖరి ఓవర్‌లో హజెల్ వుడ్ కట్టడిగా వేసినా.. క్విక్ సింగిల్స్, డబుల్స్, ట్రిపుల్స్‌తో కాన్వే-నీషమ్ పరుగులు రాబట్టారు. ఇక చివరి బంతిని నీషమ్ సిక్సర్ బాది జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications