T20 World Cup 2022: డేవిడ్ వార్నర్ కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! (వీడియో)

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఫీల్డింగ్‌లో చురుకుగా కదులుతూ సిక్సర్లను ఆపిన వార్నర్.. ఆ తర్వాత కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
4 పరుగులు సేవ్ చేశాడు
శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా మార్కస్ స్టోయినిస్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతిని ధనంజయ లాఫ్టెడ్ షాట్ ఆడగా.. డీప్ మిడ్ ఆఫ్‌లో ఉన్న వార్నర్ వెనక్కి పరుగెడుతూ బంతిని బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన అతను బంతిని వెనక్కి విసిరేసి 4 పరుగులు సేవ్ చేశాడు. అగర్ వేసిన మరుసటి ఓవర్‌లో వార్నర్ సూపర్ క్యాచ్‌కు ధనంజుయ డిసిల్వా పేవిలియన్ చేరాడు. అగర్ వేసిన మూడో బంతిని ధనంజయ్ భారీ షాట్ ఆడగా.. లాంగాఫ్‌లో ఉన్న వార్నర్ అద్భుతంగా అందుకున్నాడు. వెనక్కి పరుగెడుతూ గాల్లోకి ఎగిరిని అతను కళ్లు చెదిరే రీతిలో బంతిని అందుకున్నాడు.
నెటిజన్లు ఫీదా
వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫీదా అవుతున్నారు. 35 ఏళ్ల వయసులోనూ వార్నర్ ఫీల్డింగ్ విన్యాసాలు తమను అబ్బురపరుస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కుశాల్ మెండీస్‌ను కమిన్స్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
వార్నర్ సూపర్ క్యాచ్‌కు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా(23 బంతుల్లో 3 ఫోర్లతో 26)తో కలిసి పాతుమ్ నిస్సంక(40) ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించాడు. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం వార్నర్ సూపర్ క్యాచ్‌కు డిసిల్వా పెవిలియన్ చేరాడు. ఆ కొద్ది సేపటికే పాతుమ్ నిస్సంక రనౌటవ్వగా.. క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(7), డసన్ షనక(3) విఫలమయ్యారు. దాంతో ఆ జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications