
టాస్ కీలకం..
ఇంగ్లండ్, భారత్ మధ్య జరగనున్న సెమీఫైనల్ కోసం ప్రత్యేకంగా పిచ్ రెడీ చేయడం లేదు. ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌పైనే ఆడించనున్నారు. బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌నే సెమీఫైనల్‌కు వాడనున్నారు. దాంతో టాస్ కీలకం కానుంది. ఈ వాడేసిన పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడం కలిసొచ్చే అంశం. ఈ మైదానంలో స్క్వేర్ లెగ్ బౌండరీలు తక్కువ దూరం ఉండటంతోపాటు.. స్ట్రయిట్ బౌండరీలు దూరంగా ఉంటాయి. ఈ బౌండరీలను బట్టే బ్యాటింగ్, బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ బౌండరీలు వైపు ఆడితే పరుగులు రాబట్టవచ్చు. ఇక బౌలింగ్‌లో బిగ్గర్ బౌండరీలవైపు ఆడేలా బంతులు వేయాలి.

ముగ్గురు స్పిన్నర్లతో భారత్..
అడిలైడ్ పిచ్ నెమ్మదిగా ఉండటంతోపాటు.. స్పిన్నర్లకు కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ బంగ్లాదేశ్‌తో తమ జట్టు ఆడినప్పుడు పిచ్ స్పిన్నర్లకు సహకరించలేదని టీమిండియా కోచ్ ద్రవిడ్ తెలిపాడు. కానీ బంగ్లాదేశ్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగడం గుర్తించామని చెప్పాడు. సెమీస్‌లోనూ పిచ్ స్లోగా ఉంటే.. పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేస్తామని ద్రవిడ్ తెలిపాడు. అవసరమైతే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ జట్టులోకి రానున్నాడు.

బంగ్లా చేతిలో ఇంగ్లండ్‌కు ఓటమి..
అడిలైడ్ ఓవల్‌లో భారత్, ఇంగ్లండ్ ఇంత వరకూ ఏ ఫార్మాట్లోనూ ముఖాముఖి తలపడలేదు. ఇక్కడ ఇంగ్లండ్‌కు అంత మెరుగైన రికార్డేం లేదు. అడిలైడ్ ఓవల్‌లో 17 వన్డేలు ఆడిన ఇంగ్లిష్ జట్టు కేవలం 4 మ్యాచ్‌ల్లోనే గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక్కడ ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. అది కూడా 2011లోనే కావడం గమనార్హం. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది.

టీమిండియాకు ఓపెనింగ్ సమస్య..
ఈ టోర్నీలో అదరగొట్టిన టీమిండియాకు ఓపెనింగ్ సమస్యగా మారింది. ఇప్పటి వరకు ఓపెనర్లు రోహిత్, రాహుల్ సరైన శుభారంభాన్ని అందించలేదు.
కేఎల్ రాహుల్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది ఫామ్‌లోకి రావడం శుభ పరిణామమే అయినా..రోహిత్ రాణించాల్సి ఉంది.
విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. రోహిత్-రాహుల్ జోడి మంచి ఆరంభం ఇవ్వాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (5 మ్యాచ్‌ల్లో 246 రన్స్) నిలవగా.. సూర్యకుమార్ యాదవ్ (5 మ్యాచ్‌ల్లో 225 రన్స్) మూడో స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్ అర్షదీప్ సింగ్ 10 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications
