T20 World Cup 2022: యూఏఈ విజయం.. నెదర్లాండ్స్ ఆనందం.. టైటిలే గెలిచినంత సంబురం! (వీడియో)

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పసికూన నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది. మెగా టోర్నీ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ సంచలన ఆటతీరుకు కాస్త అదృష్టం కూడా తొడవడంతో తొలి సారి టోర్నీలో ముందడుగేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన యూఏఈ అనూహ్యంగా చివరి మ్యాచ్‌లో చెలరేగి నమీబియాను ఓడించడం నెదర్లాండ్స్‌కు కలిసొచ్చింది. క్వాలిఫయర్స్‌లో గ్రూప్-ఏలో నెదర్లాండ్.. శ్రీలంక, నమీబియా, యూఏఈతో కలిసి పోటీపడింది.
యూఏఈ విజయంతో..
యూఏఈ, నమీబియాలను ఓడించిన ఆ జట్టు.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో నెదర్లాండ్ సూపర్ 12కు అర్హత సాధించడం నమీబియా, యూఏఈ మ్యాచ్ ఫలితంపై ఆధారపడింది. లక్కీగా యూఏఈ విజయం సాధించడంతో ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేసింది. దాంతో నెదర్లాండ్ ఆటగాళ్ల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. యూఏఈ విజయం సాధించగానే డ్రెస్సింగ్ రూమ్‌లో నెదర్లాండ్ ఆటగాళ్లు రచ్చ చేశారు.

టైటిల్ గెలిచినంత సంబురం..
ఈ మ్యాచ్‌ను చాలా ఆసక్తిగా తిలకించిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. ఫలితం తేలగానే కూర్చున్న సీట్లలో నుంచి లేచి గంతేసారు. ప్రస్తుతం నెదర్లాండ్ ఆటగాళ్ల సంబరాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దాంతో అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. క్వాలిఫై అయినందుకే ఇంత సంతోషం అయితే.. టైటిల్ గెలిస్తే ఏం చేస్తారో? అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.

యూఏఈ బోణీ..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ముహమ్మద్ వసీం(41 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ చుదంగపోయి రిజ్వాన్(43 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. చివర్లో బసిల్ హమీద్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) నాటౌట్ మెరుపులు మెరిపించాడు. నమీబియా బౌలర్లలో డేవిడ్, బెర్నార్డ్, బెన్ షికోంగో తలో వికెట్ తీసారు.

పాపం నమీబియా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వైస్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), రుబెన్ ట్రంప్‌లెమన్(24 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 25 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. యూఏఈ బౌలర్లలో బసిల్ థంపి, జహూర్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. భారత సంతతి కార్తీక్ మెయప్పన్, ముహమ్మద్ వసీం, జునైద్ సిద్దిఖీ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications