IND vs PAK: బ్లాక్‌బస్టర్ టీఆర్‌పీ రేటింగ్స్.. గత రికార్డులన్నీ బ్రేక్! కోటీ 80 లక్షల వ్యూస్!

దుబాయ్: యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లప్పగించి ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఊహించనట్లుగానే కనువిందు చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎప్పటిలానే భారత్-పాక్ మ్యాచ్ ఉండే హైఓల్టేజ్ సమరం మరోసారి రిపీట్ అయ్యింది. కాకపోతే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించడం.. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకోవడం రికార్డు వ్యూస్‌ను తెచ్చిపెట్టింది.
తూటాలు, తుపాకులు లేని ఈ యుద్దంలో దక్కిన విజయం భారత అభిమానులను సంతోషపర్చగా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.
గత రికార్డులన్నీ బ్రేక్..
ఈ మ్యాచ్ దెబ్బకు గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఆసియాకప్ వేదికగా భారత్ X పాక్ తొలి మ్యాచ్ కోటీ 30 లక్షల వ్యూస్‌తో ఐపీఎల్ 2022 సీజన్, గత టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా భారత్ X పాక్ మ్యాచ్ కోటీ 80 లక్షల వ్యూస్ రాబట్టింది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే. భారత్ విజయంతో అభిమానులు ఒకరోజు ముందే దీపావళీ పండుగ చేసుకుంటుండగా.. స్టార్ స్పోర్ట్స్ లాభాలు తెచ్చిపెట్టింది.

విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్..
ఆదివారం.. ప్రపంచకప్ తొలి మ్యాచ్ కావడం.. ఓటమి అంచుల నుంచి భారత్ విజయాన్నందుకోవడం బ్లాక్ బస్టర్ వ్యూస్‌కు ఒక కారణమైతే.. కింగ్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ మరో కారణం. ఓటమి అంచుల నుంచి భారత్ విజయం వైపు నడవడం అభిమానులను ఒంటికాలిపై నిలబెట్టింది. ఇక ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ భారత్ వశం కావడం.. అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. ఈ పరిస్థితులన్నీ స్టార్ స్పోర్ట్స్‌కు పంటపండించాయి.

పరుగుల రారాజు విరాట్ కోహ్లీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్)కి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40) రాణించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications