T20 World Cup 2022: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో! రెండు టైటిళ్లతో లెక్కసరి చేసిన బెన్ స్టోక్స్!

హైదరాబాద్: ఇంగ్లండ్‌ను మరోసారి విశ్వవిజేతగా నిలబెట్టిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అసలైన హీరో బెన్ స్టోక్స్ అని, బిగ్ మ్యాచ్ విన్నర్ అనే ట్యాగ్ అతనికి సరిగ్గా సరిపోతుందని క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అభిమానులకు విలన్‌గా మారిన అతను.. అసాధారణ ప్రదర్శనతో 2019 వన్డే ప్రపంచకప్‌ను అందించాడు.
అదే విధంగా తాజా టీ20 ప్రపంచకప్ 2022లోనూ ఒంటరి పోరాటం చేసి మరోసారి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదని, కష్టాలకు కుంగిపోకుండా మన ప్రయత్నం మనం చేయాలని బెన్ స్టోక్స్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని, అతను హీరోగా నిలబడ్డ తీరు అందరికి స్పూర్తిదాయకమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

2016లో విలన్‌గా...
భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో విండీస్ విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాలి. అప్పటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. బెన్ స్టోక్స్‌కు బంతినందించాడు. ఇక వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ కార్లోస్ బ్రాత్ వైట్(10 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో వరుసగా 4 సిక్స్‌లు బాది విజయాన్ని లాగేసుకున్నాడు. బ్రాత్‌వైట్ సంచలన బ్యాటింగ్‌తో నివ్వెరపోయిన స్టోక్స్ తీవ్రంగా బాధపడ్డాడు. 19 పరుగులు డిఫెండ్ చేయకపోవడాన్ని తప్పుబడుతూ స్టోక్స్‌పై విమర్శల వర్షం కురిసింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు టైటిళ్లతో...
అయితే ఇంగ్లండ్ జట్టు మాత్రం అతనికి అండగా నిలిచింది. ఆ పరాజయంతో మరింత రాటుదేలిన స్టోక్స్.. 2019 వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ అందించాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ స్టోక్స్ (84 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు. టెస్ట్ ఫార్మాట్‌లోనూ ఒంటరి పోరాటంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ కోల్పోకుండా చేశాడు.
మానసిక సమస్యలతో చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న స్టోక్స్.. సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ బరిలోకి దిగాడు. పరిమిత ఓవర్లపైనే మరింత ఫోకస్ పెట్టిన అతను ఇంగ్లండ్‌కు కావాల్సిన విజయాన్నందించాడు. దాంతో బెన్ స్టోక్స్ లెక్క సరిచేశాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

ఒంటరి పోరాటం..
పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్(52 నాటౌట్)కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీం తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications