
వన్డే ప్రపంచకప్ తర్వాత..
2023 వన్డే ప్రపంచకప్ ముందే టీమిండియా తదుపరి సారథిని సిద్దం చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను టీమిండియా తదుపరి సారథిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఇప్పటికే తమ సారథ్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఐపీఎల్‌లో ముగ్గురు సారథులుగా కొనసాగుతున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా టైటిల్ కూడా గెలిచాడు.

35 ఏళ్లకు చేరుకోవడంతో...
రోహిత్ శర్మ వయసు 35 ఏళ్లు చేరుకోగా.. విరాట్ కోహ్లీ 34 ఏళ్లకు చేరుకున్నాడు. భారత్ క్రికెట్ ముఖ స్థంబాలు అయిన ఈ ఇద్దరి కెరీర్ చరమాంక దశలో ఉన్నారు. మూడు ఫార్మాట్లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలకం. అప్‌కమింగ్ మెగా టోర్నీల నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు రోహిత్, కోహ్లీతో మాట్లాడే అవకాశం ఉందని ఓ బోర్డు అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు తెలిపాడు. 'విరాట్, రోహిత్‌లను బలవంతంగా ఒక్క ఫార్మాట్‌ను తప్పించలేం. కానీ వాళ్లు ఇప్పటికే 35 ఏళ్లకు చేరుకున్నారు. వారికి తగినంత విశ్రాంతితో పాటు రొటేషన్ అవసరం. అప్పుడే ఐసీసీ టోర్నీల్లో తాజాగా బరిలోకి దిగగలరు. అయితే కెప్టెన్‌ను రొటేట్ చేయడం కష్టం.

వన్డేలకే ప్రాధాన్యం..
అంతేకాకుండా వచ్చే ఏడాది టీ20లు జట్టుకు ప్రాధాన్యత లేనివి. కాబట్టి ఈ ఫేజ్‌ను రోహిత్ వారసుడిని ఎంపిక చేసేందుకు వాడుకుంటాం. హార్దిక్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లను టీమిండియా సారథ్య బాధ్యతలను తీసుకోవడానికి సిద్దం చేస్తాం. హార్దిక్ , రిషభ్ పంత్ ఇప్పటికే సారథులుగా తమ సత్తా చాటారు. ఇద్దరూ ఐపీఎల్‌లో చాలా సార్లు తమ కెప్టెన్సీ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన హార్దిక్ ఇప్పటికే తాను ఎంతటి విలువైన కెప్టెన్‌నో అనే విషయాన్ని చాటి చెప్పాడు.

అప్పుడే కెప్టెన్సీ మార్పు..
కేఎల్ రాహుల్ సైతం రోహిత్, విరాట్ కోహ్లీల మద్దతుతో కెప్టెన్సీ నేర్చుకుంటున్నాడు. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాతే కెప్టెన్సీ మార్పు ఉంటుంది. 2023లో వన్డే ప్రపంచకప్ ఉన్నందున టీ20లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వం. వన్డేలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టి ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. ఈ వన్డే ప్రపంచకప్ అనంతరమే మళ్లీ 2024 టీ20 ప్రపంచకప్ కోసం దృష్టిసారిస్తాం.'అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.


Click it and Unblock the Notifications
