
హోబర్ట్: టీ20 ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. నెదర్లాండ్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 9 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ జట్టులో అసిఫ్ హోస్సెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), ఓపెనర్ నజ్ముల్ హోస్సెన్ షాంటో(20 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో మోసాద్దెక్ హోస్సెన్(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) మెరుపులు మెరిపించాడు. దాంతో బంగ్లా.. నెదర్లాండ్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచగలిగింది.
నెదర్లాండ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్, బస్ దీ లీడే రెండేసి వికెట్లు తీయగా.. టిమ్ ప్రింగిల్, షారిజ్ అహ్మద్, లోగన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. కోలిన్ అకెర్మాన్(48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అతనికి తోడుగా మరే బ్యాటర్ రాణించలేదు. చివర్లో పాల్ వాన్ మీకెరెన్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవైపు వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా మరోవైపు వాన్ మీకెరెన్ ఒంటరి పోరాటం చేశాడు. అతను 17 ఓవర్‌లో క్యాచ్ ఔటవ్వడంతో మ్యాచ్ బంగ్లావైపు మళ్లింది.
చివరి ఓవర్‌లో నెదర్లాండ్ విజయానికి 24 పరుగులు అవసరమవ్వగా.. మాన్ మీకెర్న్ సిక్స్‌తో ఉత్కంఠకు తెరలేపాడు. చివరి 2 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టాల్సి ఉండగా.. బంగ్లా బౌలర్ సౌమ్య సర్కార్ 2 పరుగుల ఇవ్వడంతో పాటు ఆఖరి బంతికి వికెట్ తీసి నెదర్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ గ్రూప్ 2లో అగ్రస్థానాన్ని అందుకుంది. పాక్‌పై గెలిచిన టీమిండియా రెండో స్థానంలో ఉంది. బంగ్లాకు మెరుగైన రన్ రేట్ ఉండటంతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. గ్రూప్ 2లో టాప్ ప్లేస్‌లో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.