Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022 సూపర్ 12 తొలి మ్యాచ్‌కే భారీ అడ్డంకి!

T20 World Cup 2022: Australia vs New Zealand Weather Forecast And Pitch Report Of Sydney Ground

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ వేటలో అత్యంత కీలకమైన సూపర్‌-12 దశకు రంగం సిద్ధమైంది. ఒక్క టైటిల్‌ కోసం రెండు గ్రూపుల్లో ఆరేసి జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. శుక్రవారంతో ముగిసిన తొలిరౌండ్‌ పోటీల నుంచి జింబాబ్వే తొలిసారిగా సూపర్‌-12కు అర్హత సాధించింది. మరో గ్రూపులో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను ఐర్లాండ్‌ ఇంటిముఖం పట్టించి అతిపెద్ద సంచలనం సృష్టించింది. ఓవరాల్‌గా గ్రూప్‌ 'ఎ' నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్‌.. గ్రూప్‌ 'బి' నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌ సూపర్‌-12కు అర్హత సాధించాయి. అయితే గతేడాది సూపర్‌-12కు చేరిన విండీస్‌, నమీబియా, స్కాట్లాండ్‌లకు ఈసారి టోర్నీలో చుక్కెదురైంది.

పటిష్టంగా ఆసీస్..

పటిష్టంగా ఆసీస్..

నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు సిడ్నీ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫించ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ తలపడనుంది. గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఇరుజట్లూ తలపడ్డా, అప్పుడు ఆసీస్‌ గెలిచింది. ఇప్పుడు ఆరంభ మ్యాచ్‌లోనూ సత్తా తేల్చుకోనున్నాయి. ఇక, 2011 నుంచి ఏ ఫార్మాట్‌లోనూ సొంత గడ్డపై ఆసీస్‌ జట్టు కివీస్‌ చేతిలో ఓడిపోలేదు. ఈసారి కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలోని కివీస్‌ జట్టులో ఫిన్‌ ఆలెన్‌, కాన్వే రూపంలో అద్భుత ఓపెనర్లున్నారు. అటు ఆసీస్‌లో వేడ్‌, హాజెల్‌వుడ్‌, జంపా ఈ ఫార్మాట్‌లో దూసుకెళుతున్నారు. ఆరంభంలో వార్నర్‌ చివర్లో టిమ్‌ డేవిడ్‌ మెరుపులను అడ్డుకునేందుకు బౌలర్లు సిద్ధంగా ఉండాల్సిందే.

మ్యాచ్ వర్షార్పణమే..?

మ్యాచ్ వర్షార్పణమే..?

ఆస్ట్రేలియా X న్యూజిలాండ్ మ్యాచ్ జరిగే సిడ్నీలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. వర్షం వల్ల అసలు ఈ మ్యాచ్‌ జరగడమే అనుమానంగా మారింది. వాన కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. లానినా ప్రభావం కారణంగా ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిడ్నీలో దీని ప్రభావం మరి ఎక్కువగా ఉంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కు కూడా వర్షం పొంచి ఉంది.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

వర్షాల కారణంగా పిచ్ పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ మ్యాచ్‌ జరిగితే మాత్రం జీవం నిండిన పిచ్‌ నుంచి పేసర్లు, స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుందన్నది అంచనా. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తోంది. వర్షం నేపథ్యంలో టాస్ గెలిచిన జట్లు ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది.

Story first published: Saturday, October 22, 2022, 7:32 [IST]
Other articles published on Oct 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+