For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠ మ్యాచ్‌.. భారత్‌ను గెలిపించిన అర్ష్‌దీప్ సింగ్!

T20 World Cup 2022: Arshdeep singh star as India 5-run win over Bangladesh

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో రోహిత్ సేన డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 5 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సూపర్ బౌలింగ్‌తో ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 16 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లిటన్ దాస్(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), నురుల్ హసన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ ఓ వికెట్ పడగొట్టాడు.

 అదిరపోయే ఆరంభం..

అదిరపోయే ఆరంభం..

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు లిటన్ దాస్, నజ్ముల్ షాంటో అదరిపోయే శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌తోనే ఓపెనర్‌గా బరిలోకి దిగిన లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 2వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన లిటన్ దాస్.. భువీ బౌలింగ్ 6, 4, 4 కొట్టాడు.

షమీ బౌలింగ్‌లో 6,4, 4 కొట్టడంతో బంగ్లాదేశ్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఇందులో లిటన్ దాస్ ఒక్కడే 56 పరుగులు చేయగా.. నజ్ముల్ 4 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో 6 పరుగులే రాగా.. వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. ఆట ఆగిపోయే సరికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆ జట్టు 17 పరుగుల ముందంజలో నిలిచింది.

మలుపు తిప్పిన రాహుల్ రనౌట్..

మలుపు తిప్పిన రాహుల్ రనౌట్..

దాంతో భారత శిభిరంలో ఆందోళన నెలకొంది. కానీ వర్షం ఆగిపోవడంతో అంపైర్లు మ్యాచ్‌‌ను 16 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 151 పరుగులుగా నిర్ణయించారు. ఆట పునప్రారంభమైన తర్వాత తొలి ఓవర్‌లోనే డేంజరస్ లిటన్ దాస్(60) రనౌటయ్యాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫీల్డింగ్‌కు అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత షమీ.. షాంటోను పెవిలియన్ చేర్చగా.. అర్ష్‌దీప్ ఒకే ఓవర్‌లో అఫిఫ్(3), షకీబ్ అల్ హసన్(13)ను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. హార్దిక్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్‌లో యాసిర్ అలీ(1), మోసద్దెక్ హోస్సెన్(6) ఔటవ్వడంతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది.

అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్..

అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్..

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో బంగ్లా విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు అవసరమయ్యాయి. 15వ ఓవర్‌లో హార్దిక్ 11 పరుగులే ఇవ్వడంతో చివరి 6 బంతుల్లో బంగ్లా విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. తొలి మూడు బంతుల్లో అర్ష్‌దీప్ ఏడు పరుగులివ్వడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. నాలుగో బంతికి డబుల్ రాగా.. ఐదో బంతికి బౌండరీ రావడంతో ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమయ్యాయి. అర్ష్‌దీప్ చివరి బంతికి సింగిల్ మాత్రమే ఇవ్వడంతో భారత విజయం లాంఛనమైంది.

Story first published: Wednesday, November 2, 2022, 17:58 [IST]
Other articles published on Nov 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+