Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: కీలక మ్యాచ్‌లో మెరిసిన మాక్సీ, మార్ష్. . అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం!

T20 World Cup 2022: Afghanistan chasing 169 as Maxwell FIFTY powers Australia to 168/8

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్మురేపారు. విధ్వంకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(32 బంతుల్లో 6 ఫోర్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో అఫ్గాన్ ముందు ఆసీస్ 169 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మ్యాడ్ మ్యాక్సీకి తోడుగా మిచెల్ మార్ష్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), డేవిడ్ వార్నర్(18 బంతుల్లో 5 ఫోర్లతో 25) విలువైన పరుగులు చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా.. ఫజల్లాక్ ఫరూఖీ రెండు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గాయంతో రెగ్యూలర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూరమవడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కామెరూన్ గ్రీన్(3) దారుణంగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్ష్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడుతున్న వార్నర్‌తో పాటు క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(4)ను నవీన్ ఉల్ హక్ ఒకే ఓవర్‌లో ఔట్ చేయడంతో ఆసీస్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 52 పరుగులు చేసింది.

క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్‌తో మిచెల్ మార్ష్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. అతన్ని ముజీబ్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మార్కస్ స్టోయినీస్ ఔటవ్వగా.. గ్లేన్‌మ్యాక్స్ వెల్ చెలరేగాడు. ఓవైపు మాథ్యూవేడ్(6), ప్యాట్ కమిన్స్(0), కేన్ రిచర్డసన్(1) ఔటైనా.. మరోవైపు తనదైన హిట్టింగ్‌తో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన మ్యాక్సీ.. అసలు సిసలు మ్యాచ్‌లో సత్తా చాటాడు.

Story first published: Friday, November 4, 2022, 15:44 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+