Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బ్యాటింగ్‌ నాకే అసహ్యం వేసింది: ఆరోన్ ఫించ్

T20 World Cup 2022: Aaron Finch says My innings was poor After Australia beat Sri Lanka by 7 Wickets

పెర్త్: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్ విధానం తనకే అసహ్యం తెప్పించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన ఫించ్.. ఎలాంటి సాకులు చెప్పకుండా తన బ్యాటింగ్ వైఫల్యాన్ని అంగీకరించాడు. తన బ్యాటింగ్ చెత్తగా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.

'విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఇన్నింగ్స్ మరీ దారుణం. చెత్తగా ఆడాను. బంతిని హిట్ చేయలేకపోయాను. కానీ మా జట్టు బ్యాటింగ్ అప్రోచ్ బాగుతుంది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటం, సీమ్ లభిస్తుండటంతో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయ్యింది. చివరి వరకు క్రీజులో ఉండటం ముఖ్యమనిపించింది. నేను హిట్టింగ్ ప్రయత్నిస్తే ఔటయ్యేవాడిని. శ్రీలంక బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పెద్ద మైదానాల్లో హార్డ్ లెంగ్త్‌లను పిక్ చేయడం చాలా కష్టం. ఈ విజయంతో రెండు పాయింట్లు రావడం సంతోషంగా ఉంది. స్టోయినిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇంటెంట్ చాలా ముఖ్యమైనది. తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. అది బిగ్ మ్యాచ్. ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం'అని ఫించ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ తీవ్రంగా తడబడ్డాడు. అతని బలహీనత అయిన ఇన్‌కమింగ్ డెలివరీలనే లంక బౌలర్లు అస్త్రంగా మార్చుకోవడంతో క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. డాట్ బాల్స్ ఆడుతూ జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించాడు. అతని చెత్త బ్యాటింగ్‌తో ఒత్తిడికి లోనైన డేవిడ్ వార్నర్(11), మిచెల్ మార్ష్(18) భారీ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నారు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ గేర్ మార్చడంతో ఆస్ట్రేలియా మూమెంటమ్ అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(45 బంతుల్లో 2 ఫోర్లతో 40), చరిత్ అసలంక(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), ధనంజయ డిసిల్వా(23 బంతుల్లో 3 ఫోర్లతో 26) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినీస్(18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59 నాటౌట్) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) మెరుపులు మెరిపించగా... ఆరోన్ ఫించ్(42 బంతుల్లో సిక్స్‌తో 31 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Tuesday, October 25, 2022, 20:35 [IST]
Other articles published on Oct 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+