Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే స్టీవ్ స్మిత్‌ను పక్కనపెట్టాం: ఆరోన్ ఫించ్

T20 World Cup 2022: Aaron Finch reveals the reason why Steve Smith not playing against New Zealand

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 అసలు సిసలు సూపర్ 12 సమరానికి తెరలేచింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఉంచింది. వర్షం పొంచి ఉండటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మైదానం కవర్స్‌తో కప్పి ఉంచిన నేపథ్యంలో మ్యాచ్ జరుగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని చెప్పాడు.

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే స్టీవ్ స్మిత్‌తో పాటు అగర్, రిచర్డ్‌సన్, కామెరూన్ గ్రీన్‌కు అవకాశం దక్కలేదన్నాడు. ఆస్ట్రేలియాకు ఆడుతున్న ప్రతీసారి ఒత్తిడికి గురవ్వడం సహజమని చెప్పుకొచ్చాడు. అయితే ప్రతీసారి తమకు అద్భుతమైన మద్దతు లభిస్తదని వెల్లడించాడు.

ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. ఈ మెగా టోర్నీ కోసం తమ ఆటగాళ్లు అన్ని విధాలుగా సిద్దమయ్యారని తెలిపాడు. గతాన్ని మార్చడం సాధ్యం కాదని చెప్పిన కేన్ మామ.. ప్రస్తుత మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వవచ్చని తెలిపాడు. ప్రణాళికలకు తగ్గట్లు ఆడితే విజయం సాధించవచ్చన్నాడు.

గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఇరుజట్లూ తలపడ్డా, అప్పుడు ఆసీస్‌ గెలిచింది. ఇప్పుడు ఆరంభ మ్యాచ్‌లోనూ సత్తా తేల్చుకోనున్నాయి. ఇక, 2011 నుంచి ఏ ఫార్మాట్‌లోనూ సొంత గడ్డపై ఆసీస్‌ జట్టు కివీస్‌ చేతిలో ఓడిపోలేదు. ఈసారి కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలోని కివీస్‌ జట్టులో ఫిన్‌ ఆలెన్‌, కాన్వే రూపంలో అద్భుత ఓపెనర్లున్నారు. అటు ఆసీస్‌లో వేడ్‌, హాజెల్‌వుడ్‌, జంపా ఈ ఫార్మాట్‌లో దూసుకెళుతున్నారు. ఆరంభంలో వార్నర్‌ చివర్లో టిమ్‌ డేవిడ్‌ మెరుపులను అడ్డుకునేందుకు బౌలర్లు సిద్ధంగా ఉండాల్సిందే.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్

న్యూజిలాండ్: డేవాన్ కాన్వే, ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లేన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Story first published: Saturday, October 22, 2022, 12:44 [IST]
Other articles published on Oct 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+