For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఆడమ్ జంపాను పక్కనపెట్టాం: ఆరోన్ ఫించ్

T20 World Cup 2022: Aaron Finch reveals the reason why Adam Zampa not playing against Sri Lanka

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పిచ్‌పై ముందుగా బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని, వికెట్‌పై గడ్డి ఉన్నందున పేసర్లకు అనుకూలిస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. అనారోగ్యంతో ఆడమ్ జంపా ఈ మ్యాచ్‌‌కు దూరమయ్యాడని, అతని స్థానంలో అష్టోన్ అగర్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఈ టోర్నీలో తమ జట్టు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి రేసులో నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఘోర పరాజయంతో ఆ జట్టు రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోయింది.

ఈ మ్యాచ్‌కు ముందు ఆడమ్ జంపా కరోనా బారిన పడినట్లు తెలిసింది. అయితే కరోనా సోకినా టోర్నీలో పాల్గొనే అవకాశం ఐసీసీ కల్పించింది. దాంతో బరిలోకి దిగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా మాత్రం అతనికి రెస్ట్ ఇచ్చింది. బహుషా తదుపరి మ్యాచ్‌లకు కోలుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది.

ఇక ఈ సవాల్‌కు తాము సిద్దంగా ఉన్నామని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. ఆసియా కప్ విజయం తర్వాత తమ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని, తమ జట్టు నిలకడగా రాణిస్తుందని చెప్పాడు. గతంలో భారీ లక్ష్యాలను కాపాడుకున్నామని గుర్తు చేశాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పాతుమ్ నిస్సంక జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

తుది జట్లు:

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లాహిరు కుమార

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, టీమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్), అష్టోన్ అగర్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్.

Story first published: Tuesday, October 25, 2022, 16:25 [IST]
Other articles published on Oct 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+