
1. చెత్త ఫీల్డింగ్
సౌతాఫ్రికా చేతిలో భారత ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో అద్భుత ఫీల్డింగ్ చేసిన టీమిండియా.. సౌతాఫ్రికాతో మాత్రం స్థాయికి తగ్గట్లు ఫీల్డింగ్ చేయలేకపోయింది. సునాయస రనౌట్లతో పాటు లాలిపాప్ క్యాచ్‌లను నేలపాలు చేసింది. రనౌట్‌కు అవకాశం ఉన్న సమయంలో వికెట్ల వెనుక ఫీల్డర్ ఉండాలనే సోయి కూడా మరిచింది. రోహిత్ రెండు సునాయస రనౌట్లు చేజార్చగా.. సూర్య ఒక్క అవకాశాన్ని వృథా చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో సమన్వయ లోపంతో బౌండరీ లైన్ వద్ద వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసి పాకిస్థాన్ తరహా చెత్త ఫీల్డింగ్‌ను గుర్తు చేశారు. రనౌట్లు చేసినా.. క్యాచ్‌లు పట్టినా ఈ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరుచుకోకుంటే రోహిత్ సేన సెమీఫైనల్లో గెలవడం కష్టం.

2. మిల్లర్-మార్క్‌రమ్ సూపర్ బ్యాటింగ్
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు గట్టి షాకిచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీయగా.. షమీ మరో వికెట్ తీసాడు. దాంతో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మిల్లర్-మార్క్‌రమ్ జట్టును ఆదుకున్నారు. రక్షణాత్మక ధోరణిలో ఆడుతూ.. జట్టును విజయం వైపు నడిపించారు. భారత ఫీల్డర్ల తప్పిదాలతో వారికి కాస్త లక్ కూడా కలిసొచ్చింది. 10 ఓవర్లకు 40/3 పరుగులే చేసినా.. ఆ జట్టుకు చివరకు విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. మిల్లర్-మార్క్‌రమ్ నాలుగో వికెట్‌కు 76 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడీని విడదీసి ఉంటే టీమిండియాకు విజయ అవకాశాలు ఉండేవి.

3. అశ్విన్‌కు 18వ ఓవర్ బౌలింగ్ ఇవ్వడం
సౌతాఫ్రికా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచింది. అప్పుడే బిగ్ పార్టనర్‌షిప్‌కు బ్రేక్ పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. పేస్ బౌలర్లు రాజ్యమేలుతున్న పిచ్‌పై అశ్విన్‌కు 18వ ఓవర్ ఇవ్వడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్స్‌లు బాది తమపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. పేసర్లకే బౌలింగ్ ఇచ్చి అశ్విన్‌ను ఆఖరి వరకు ఆపి ఉంటే.. సఫారీ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యేవారని, అప్పుడు అశ్విన్ చివరి ఓవర్‌లో మ్యాజిక్ చేయడానికి అవకాశం ఉండేదనే అభిప్రాయాన్ని కామెంటేటర్లు వినిపించారు.

4. భారత్ టాప్-5 వైఫల్యం
భారత టాప్-5 బ్యాటర్లు ఘోర వైఫల్యం కూడా సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. సఫారీ పేస్ ధాటికి రోహిత్(15), రాహుల్(9), కోహ్లీ(12), దీపక్ హుడా(0), హార్దిక్ పాండ్యా(2) దారుణంగా విఫలమవ్వడంతో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్య సూపర్ ఇన్నింగ్స్‌తో పోరాడే లక్ష్యాన్ని సఫారీ ముందు ఉంచింది. కానీ టాప్ -5 బ్యాటర్లలో ఏ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినా టీమిండియా ఈజీగా 160 పరుగులు చేసేది. అప్పుడు బౌలర్లకు పోరాడేందుకు మరింత ఆస్కారం ఉండేది.

5. సూర్య, కార్తీక్ ఔటవ్వడం..
49/5 స్థితి నుంచి 52 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్న సూర్య కుమార్ యాదవ్(68), దినేశ్ కార్తీక్(6) కడవరకు ఉండకపోవడం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. బ్యాటింగ్ గేర్ మార్చాల్సిన 16వ ఓవర్‌లో కార్తీక్ ఔటవ్వడంతో సూర్య ఓంటరివాడయ్యాడు. రిస్క్ తీసుకోలేక.. ఆచితూచి బౌండరీలు కొట్టాడు. చివరకు 19వ ఓవర్‌లో అతనూ కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. చివరి 2 ఓవర్లలో భారత్ 9 పరుగులు మాత్రమే చేసింది. ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. క్రీజులో సూర్య ఉన్నా.. టేయిలెండర్స్ భారీ షాట్లు ఆడినా భారత్‌కు మరో 15 పరుగులు వచ్చేవి.


Click it and Unblock the Notifications












