T20 World Cup 2022: పాక్‌తో సెమీస్.. ఈ నాలుగు తప్పిదాలే న్యూజిలాండ్ కొంపముంచాయి!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన కీలక సెమీ ఫైనల్లో కివీస్ 7 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్-12లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు కీలక పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఐసీసీ టోర్నీల్లో వరుసగా ఐదో సారి నాకౌట్ స్టేజ్‌లోనే ఇంటిదారిపట్టింది.
అయితే పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణాలు చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్, పరమ చెత్త ఫీల్డింగ్. ఈ మూడు విభాగాల్లో దారుణంగా విఫలమైన ఆ జట్టు.. తమ కంటే బలహీనమైన పాకిస్థాన్‌పై విజయం సాధించలేకపోయింది.
1. హిట్టర్ల వైఫల్యం..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ శుభారంభం అందుకోలేకపోయింది. కండిషన్స్‌తో సంబంధం లేకుండా హిట్టింగ్‌కు ప్రయత్నించిన ఫిన్ అలెన్ తొలి ఓవర్‌లోనే వెనుదిరగ్గా.. షాదాబ్ ఖాన్ సూపర్ ఫీల్డింగ్ డేవాన్ కాన్వే రనౌటయ్యాడు. ఆ వెంటనే విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్ రిటర్న్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. కివీస్ జట్టులో ఫించ్ హిట్టర్లు అయిన ఈ ముగ్గురి వైఫల్యం ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. వాస్తవానికి ఈ ముగ్గురి అసాధారణ ప్రదర్శన కారణంగానే కివీస్ సెమీస్ చేరుకుంది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కుకున్నా ఫలితం మరోలా ఉండేది.
ధాటిగా ఆడలేకపోవడం..
49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదని భావించి క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేయలేదు. కీలక సమయంలో కేన్ విలియమ్సన్ ఔటవ్వడం ఆ జట్టు కొంపముంచింది. 16 నుంచి 20 ఓవర్ల మధ్య న్యూజిలాండ్ బ్యాటర్లు కొట్టింది కేవలం రెండంటే రెండు ఫోర్లు మాత్రమే. ఈ ఐదు ఓవర్లలో 46 పరుగులు మాత్రమే చేసిన కివీస్.. భారీ షాట్లు ఆడే ప్రయత్నమే చేయలేదు. స్లాగ్ ఓవర్లలో బౌండరీలు రాబట్టి మరో 20 పరుగులు అదనంగా చేసుంటే పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యేది.
పేలవ బౌలింగ్
కివీస్ బ్యాటింగ్ తీరు చూసినా తర్వాత ఈ వికెట్‌పై 153 పరుగుల లక్ష్యం కఠినమేనని అంతా అనుకున్నారు. కానీ వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్ కలిగిన న్యూజిలాండ్ ఎన్నడూ లేని విధంగా తేలిపోయింది. అసలు బౌలింగ్ చేస్తుంది కివీస్ బౌలర్లేనా? అనిపించింది. కివీస్ బ్యాటర్లు తడబడ్డ వికెట్‌పై పాక్ ఓపెనర్లు చెలరేగుతుండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్వింగ్‌కు అనుకూలంగా లేని వికెట్‌పై న్యూజిలాండ్ బౌలర్లు తేలిపోయారు. చెత్త బౌలింగ్‌తో ఫామ్‌లో లేని పాక్ బ్యాటర్లకు పరుగులిచ్చారు. పవర్ ప్లేలో వికెట్లు తీసుంటే పాక్ ఒత్తిడికి లోనయ్యేది. అప్పుడు మ్యాచ్ హోరాహోరీగా సాగేది.

చెత్త ఫీల్డింగ్..
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ కలిగిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది న్యూజిలాండే. కానీ ఈ కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డింగ్ మరీ దారుణంగా ఉంది. చేతులకు వచ్చిన సునాయస క్యాచ్‌లను వదిలేసిన కివీస్ ఫీల్డర్లు.. రనౌట్ అవకాశాలను చేజార్చారు. తొలి ఓవర్‌లోనే బాబర్ ఆజామ్‌కు రెండు లైఫ్స్ ఇచ్చారు. కీపర్ కాన్వే బాబర్ ఆజామ్ ఇచ్చిన క్యాచ్ వదిలేయగా.. ఆ తర్వాత రెండు సార్లు రనౌట్ చేయలేకపోయారు. హారిస్ ఇచ్చిన క్యాచ్‌లను సాంట్నర్, ఇష్ సోదీ వదిలేయగా.. 20 వరకు పరుగులను ఆపలేకపోయారు. ఫీల్డింగ్ కట్టడిగా చేసున్నా.. మ్యాచ్ కివీస్‌కు అనుకూలంగా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications