T20 World Cup 2021: శార్దూల్‌కు చోటివ్వడం మంచిదే! మరీ చాహల్ మాటేమిటి? బీసీసీఐని నిలదీస్తున్న ఫ్యాన్స్!

హైదరాబాద్: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక మార్పు చేసింది. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చిన భారత సెలెక్షన్ కమిటీ.. ప్రధాన జట్టులో ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చేర్చింది. టీమిండియా సన్నాహకం కోసం మరో 8 మంది యువ ఆటగాళ్లను దుబాయ్‌లోనే టీమ్‌తో ఉంచుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ కీలక మార్పుపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్న అభిమానులు.. జట్టులో ఇతర మార్పుల గురించి నిలదీస్తున్నారు.
చాహల్ మాటేమిటి?
ముఖ్యంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణంగా విఫలమైన రాహుల్ చాహర్‌పై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. యూఏఈ గడ్డపై అతని కన్నా మెరుగ్గా రాణించిన యుజ్వేంద్ర చాహల్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు. యూఏఈ వేదికగా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రాహుల్ చాహర్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా దారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో ముంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. మరోవైపు యుజ్వేంద్ర చాహల్ మాత్రం.. 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఇందులో మ్యాచ్ విన్నింగ్ పెర్పామెన్స్ (3/11, 3/29) ఉన్నాయి.
పాపం అక్షర్..
చాహల్ సూపర్ ఫామ్ చూసి అతను టీ20 ప్రపంచకప్ జట్టులోకి కమ్‌బ్యాక్ చేయడం ఖాయమని అంతా భావించారు. దారుణంగా విఫలమైన రాహుల్ చాహర్ స్థానంలో జట్టులోకి వస్తాడనుకున్నారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు చాహల్ పెర్ఫామెన్స్‌ను పట్టించుకోలేదు. అయితే 7 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. శార్దూల్ ఠాకూర్ కోసం అక్షర్‌ను తప్పించడం ఏమాత్రం బాలేదని, దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్ స్థానాల్లో శార్దూల్‌ను తీసుకోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రాహుల్ చాహర్ ఎందుకు..?
శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకొని బీసీసీఐ మంచి పనిచేసిందని, కాకపోతే అక్షర్‌ను తప్పించాల్సింది కాదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్ స్థానంలో తీసుకుంటే బాగుండని కామెంట్ చేశాడు. అసలు రాహుల్ చాహర్‌ను ఇంకా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో? అర్థం కావడంలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అక్షర్ ప్లేస్‌లో శార్దూల్‌ను తీసుకున్నట్లు చాహర్ స్థానంలో చాహల్‌కు అవకాశమివ్వాల్సిందని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. అసలు చాహర్‌కు అండగా నిలుస్తున్నదెవరో? అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా రివైజ్డ్ టీమ్..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
సన్నాహక ఆటగాళ్లు: అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications