For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: అసలు నెట్ రన్ రేట్‌ అంటే ఏమిటీ? దాన్ని ఎలా లెక్కిస్తారంటే..?

T20 World Cup 2021: What is NRR and how its calculations are done

హైదరాబాద్: 'నెట్ రన్ రేట్'- ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న పదం. టీ20 ప్రపంచకప్ రేసులో నిలిచిన జట్లను కలవర పెడుతున్న అంశం. ఐపీఎల్ నుంచి టీ20 ప్రపంచకప్ వరకు అన్నీ టోర్నీల్లో ఈ నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. తాజాగా టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్-1 నుంచి విజయాలు సాధించినా.. మెరుగైన రన్‌రేట్ లేకనే సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తమ జట్టులానే నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నాకౌట్ దశకు చేరాయి. దాంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.

గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నాలుగేసి విజయాలు సాధించాయి. కానీ మెరుగైన రన్ రేట్ ఉన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. సౌతాఫ్రికా మాత్రం ఇంటి బాట పట్టింది. గ్రూప్-2‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గాన్ విజయం సాధిస్తే.. మరోసారి రన్‌రేట్ కీలకం కానుంది. నమీబియాపై టీమిండియా భారీ విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌తో సెమీఫైనల్ చేరనుంది. న్యూజిలాండ్‌ గెలిస్తే మాత్రం నేరుగా ఆ జట్టు ముందడుగు వేయనుంది. ఈ క్రమంలోనే ఈ నెట్ రన్ రేట్ విషయం గురించి తెలుసుకుందాం. దాన్ని ఎలా లెక్కిస్తారో చూద్దాం.

నెట్ రన్‌రేట్ అంటే..?
టోర్నీల్లో ఆయా గ్రూపుల్లో ఉన్న జట్లు సమంగా విజయాలు సాధించినప్పుడు నెట్‌రన్‌రేట్ పద్దతిని ఉపయోగిస్తారు. టోర్నీలో ఏ జట్టు ముందడుగు వేయాలనే విషయాన్ని తేల్చేందుకు ఆయా జట్లు చేసిన పరుగులు, వేసిన ఓవర్లతో నెట్‌రనేట్‌ను లెక్కగడుతారు. అయితే నెట్ రన్ రేట్ కూడా సమమైతే అత్యధిక వికెట్ల తీసిన జట్టు‌కు ముందు స్థానంలో ఉంటుంది.

నెట్ రన్‌రేట్ లెక్కించే మ్యాథమెటికల్ ఫార్మూలా:

నెట్‌ రన్ రేట్= ( టీమ్ చేసిన పరుగులు ÷ టీమ్ ఆడిన మొత్తం ఓవర్లు) - ( టీమ్ మొత్తం ఇచ్చిన పరుగులు ÷ టీమ్ మొత్తం వేసిన ఓవర్లు)

భారత రన్ రేట్ లెక్కను చూస్తే..

భారత్ చేసిన రన్స్

పాకిస్థాన్‌తో 20 ఓవర్లలో 151/7

న్యూజిలాండ్‌తో 20 ఓవర్లలో 110/7

అఫ్గానిస్థాన్‌తో 20 ఓవర్లలో 210/2

స్కాట్లాండ్‌తో 6.3 ఓవర్లలో 89/2

టోర్నీలో ఇప్పటి వరకు భారత్ 66 ఓవర్ల మూడు బంతుల్లో 560 రన్స్ చేసింది. (66 ఓవర్ల మూడు బంతులను లెక్కల్లో 66.5గా రాస్తారు.)

ఈ లెక్కన ఫార్మూలాను అప్లే చేస్తే 560 ÷ 66.5 = 8.421

నోట్: అయితే రన్‌రేట్ లెక్కించే క్రమంలో ఎన్ని వికెట్లను కోల్పోయారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోరు. కాకపోతే ఆలౌట్ అయితే మాత్రం 20 ఓవర్లను లెక్కలోకి తీసుకుంటారు.

భారత్ ఇచ్చిన పరుగులు..

పాకిస్థాన్‌ 17.5 ఓవర్లలో 152/0

న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 111/2

అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 144/7

స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85/10

ఈ లెక్కన 72 ఓవర్ల మీద మరో రెండు బంతులు వేసి 492 రన్స్ ఇచ్చింది. (72 ఓవర్ల 2 బంతులను 72.33గా లెక్కిస్తారు.)
492 ÷ 72.33= 6.802

భారత నెట్ రన్‌రేట్= 8.421-6.802= 1.619

Story first published: Sunday, November 7, 2021, 17:06 [IST]
Other articles published on Nov 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+