For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: మార్క్‌రమ్ మెరుపులు.. సౌతాఫ్రికా బోణీ! చిత్తయిన విండీస్!

T20 World Cup 2021: South Africa win by 8 wickets against West Indies

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు సౌతాఫ్రికా విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన తొలి ఓటమి నుంచి త్వరగానే తేరుకొంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా కట్టడిగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ విధ్వంసకరులు అడ్డుకున్న సఫారీ టీమ్.. ఆ తర్వాత సమయోచిత బ్యాటింగ్‌తో అదిరిపోయే విజయాన్నందుకుంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం లీగ్‌లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఇంగ్లండ్‌తో చిత్తయిన విండీస్.. సౌతాఫ్రాకాతో మెరుగైన ప్రదర్శన కనబర్చినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఎవిన్ లూయిస్‌ (56) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ రెండు, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో వికెట్ తీశారు. అనంతరం 144 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ చేధించింది. 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 144 రన్స్ చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించగా.. వాన్ డెర్ డస్సెన్(51 బంతుల్లో 3 ఫోర్లతో 43), రీజా హెన్రీక్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసెన్ ఓ వికెట్ తీయగా.. కెప్టెన్ టెంబా బవుమా(2) రనౌట్‌గా వెనుదిరిగాడు.

లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆండ్రీ రస్సెల్ సూపర్‌త్రోకు టెంబా బవుమా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డసెన్‌తో హెన్రీక్స్ బాధ్యతాయుతంగా ఆడాడు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని హోసెన్ విడదీసాడు. హెట్‌మైర్ సూపర్ డైవ్ క్యాచ్‌కు హెన్రీక్స్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో క్రీజులోకి అడుగుపెట్టిన మార్క్‌రమ్ ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి సౌతాఫ్రికా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్‌ నుంచి గేర్ మార్చిన ఎవిన్‌ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబడా వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్‌ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్‌ వాల్ష్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్‌ (26) పరుగులు చేశాడు. డ్వేన్‌ బ్రావో (8), అకీల్ హోసీన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు.

Story first published: Tuesday, October 26, 2021, 19:24 [IST]
Other articles published on Oct 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+