T20 World Cup 2021: ఆ బలహీనతపై దెబ్బ కొడితే న్యూజిలాండ్‌పై అఫ్గాన్‌దే విజయం! కానీ...

అబుదాబి: పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్ భవితవ్యం ఇప్పుడు అఫ్గానిస్థాన్ చేతిలో ఉంది. సూపర్ 12, గ్రూప్2లో భాగంగా నేడు(ఆదివారం) మధ్యాహ్నం న్యూజిలాండ్‌తో అఫ్గానిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్ చేరుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో మరో బెర్త్ ఖారారు కానుంది. ఈ పోరులో న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్ ఓడితే భారత్‌కు అవకాశాలుంటాయి. సోమవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన మరో భారీ విజయం సాధిస్తే..సెమీస్ చేరుతుంది. అయితే న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్ ఓడించగలదా? అనే ప్రశ్నే ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతోంది.

అఫ్గాన్‌కు ఓడించే సత్తా ఉంది..
ఓవైపు భారత అభిమానులంతా అఫ్గానిస్థాన్ జట్టుకు అండగా నిలుస్తూ ఆ జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తుండగా.. మరోవైపు విశ్లేషకులు న్యూజిలాండ్ ఓడించడానికి అఫ్గాన్‌కు ఉన్న మార్గాలను సూచిస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ కోసం యావత్ భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టీ20 వరల్డ్‌కప్ 2021లో పాకిస్థాన్‌కు చెమటలు పట్టించిన అఫ్గానిస్థాన్ జట్టుకి న్యూజిలాండ్‌ను ఓడించే సామర్థ్యం ఉందని క్రికెట్ విమర్శకులు అంటున్నారు. న్యూజిలాండ్ బలహీనతలను టార్గెట్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లాన్‌తో బరిలోకి దిగితే అఫ్గాన్ విజయం సాధించడం ఖాయమంటున్నారు.

స్పిన్ ఉచ్చులో..
స్పిన్ ఆడటంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ తడబడుతారనే విషయం తెలిసిందే. ఎన్నోసార్లు ఆ జట్టు స్పిన్ ఉచ్చులో చిక్కుకొని మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అప్గాన్ కూడా ఇదే బలహీనతను టార్గెట్ చేయాలని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. పైగా అఫ్గాన్ జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమంటున్నారు. గాయంతో గత మ్యాచ్‌లకు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అతను గనుక ఆడితే ఈ ముగ్గురు స్పిన్నర్ల 12 ఓవర్లలో న్యూజిలాండ్‌కు చుక్కలు కనబడటం ఖాయం.

కేన్ మామను ఔట్ చేస్తే..
అలానే న్యూజిలాండ్ మిడిలార్డర్ ఈ టోర్నీలో బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లతో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ని వేగంగా ఔట్ చేయగలిగితే.. కివీస్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇక చివరిగా అఫ్గానిస్థాన్ హిట్టింగ్ స్కిల్స్. టోర్నీ ఆరంభం నుంచి మ్యాచ్ ఫలితాల గురించి ఆలోచించకుండా అఫ్గానిస్థాన్ టాపార్డర్ మొదటి నుంచే హిట్టింగ్ చేస్తోంది. కివీస్‌తో మ్యాచ్‌లోనూ వాళ్లు బ్యాట్ ఝళిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరుని బోర్డుపై ఉంచితే కివీస్‌పై ఒత్తిడి పడనుంది. కానీ.. అన్నింటికీ మించి అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మన్‌లు.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, మిల్నే పేస్‌ను ఎదుర్కొని నిలవాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications