T20 World Cup 2021: పాకిస్థాన్ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్!

కరాచీ: టీ20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్ క్రికెట్‌లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. మెగా టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన రెండు గంటల్లోనే హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో తాత్కలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నియమించింది. ఇక పీసీబీ చైర్మన్‌గా ఆ జట్టు మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్, బౌలింగ్ కోచ్‌గా వెర్నన్ ఫిలండర్‌ను నియమించారు. కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రమీజ్ రాజా ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.

పాక్ టీమ్‌లో దూకుడు పెరుగుతుంది..
హెడెన్ రాకతో పాకిస్థాన్ జట్టులో దూకుడు పెరుగుతుందని, ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతని అపార అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. అంతేకాకుండా డ్రెస్సింగ్‌లో రూమ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఉంటే ఆ వాతావరణం వేరేలా ఉంటుందన్నాడు. ఇక ఫిలాండర్ కూడా అద్భుతమైన ఆటగాడని, బౌలింగ్ విషయంలో అతనికి అపార నైపుణ్యం ఉందని చెప్పాడు.
వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో మాథ్యూ హెడెన్ ఒకడు. తన హయాంలో ఆస్ట్రేలియాకు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒంటి చేత్తో విజయాలు అందించాడు. ఇక పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండతోనే రమీజ్ రాజా పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.

ఇంగ్లీష్ టీచర్‌ను పెట్టాలి..
ఇక పాకిస్థాన్ టీమ్‌కు హెడ్ కోచ్ మాథ్యూ హెడెన్‌ను నియమించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. పాక్ జట్టులో ఎవరీకి పెద్దగా ఇంగ్లీష్ రాదని, వారికి హెడెన్ మాటలు అర్థమయ్యేందుకు ఓ ఇంగ్లీష్ టీచర్‌ను పెట్టుకోవాలని అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. ఆటగాడిగా ఘనమైన రికార్డు ఉన్న హెడెన్‌కు కోచ్‌గా అనుభవం లేదని, మరీ మెగాటోర్నీలో పాక్ టీమ్ ఎలా రాణిస్తుందోనని కామెంట్ చేస్తున్నారు. మాథ్యూ హెడెన్ ఎంట్రీతో అయితే పాక్ జట్టుపై అంచనాలు పెరిగాయని, మరి ఏ మేరకు రాణిస్తారో చూడాలంటున్నారు.

బాబర్ ఆజామ్ సారథ్యంలో..
టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పీసీబీ ప్రకటించగా.. బాబర్‌ఆజామ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఎంపికయ్యారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ షార్జీల్ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. ఇక యువ ఆటగాడు అజమ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్ అలీ, కుష్‌దిల్ షా లాంటి కొత్త ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న ఇరు జట్లు తలపడనున్నాయి.

పాకిస్తాన్ టీ20 జట్టు ఇదే
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications