
టెలవిజన్ చరిత్రలోనే..
ఈ మ్యాచ్ ద్వారా స్టార్ భారీ మొత్తంలో అడ్వర్టైజింగ్ రెవెన్యూ పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగా మెగా మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్‌కు భారీ రేటు ఫిక్స్ చేసింది. పది సెకన్ల యాడ్ స్లాట్‌కు రూ.25-30 లక్షల వరకు వసూలు చేస్తుందని సమాచారం. స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించి భారత టెలివిజన్ చరిత్రలోనే ఓ యాడ్‌కు ఇంత మొత్తం వసూలు చేయడం ఇదే తొలిసారి అని అడ్వర్టైజ్‌మెంట్ ఇండస్ట్రీ వర్గాలు చెబతున్నాయి. యాడ్ ధర భారీగా ఉన్నప్పటికీ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే పలు కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు..
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. దాంతో మెగాటోర్నీలో జరిగే మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభం కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా టిక్కెట్లు ఓ గంటలోనే అమ్ముడుపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా.. టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోవడం విశేషం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దాయాదుల పోరుకు ఎంత క్రేజ్ ఉందొ.

మనసు మార్చుకున్న ఐసీసీ..
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ముందుగా ప్రేక్షకులును అనుమతించకుండా టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. 70% సామర్థ్యంతో టోర్నీని నిర్హహిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25000. 70% సామర్థ్యం అంటే ప్రతి మ్యాచులో దాదాపు 18500 సీట్లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల ప్రారంభ ధర ఒమన్‌లో 10 ఒమాని రియల్, యూఏఈలో 30 దిర్హామ్‌లుగా ఐసీసీ నిర్ణయించింది. టిక్కెట్లను www.t20worldcup.com/tickets నుంచి కొనుగోలు చేయవచ్చు.

గ్రూప్-2లో భారత్:
టీ20 ప్రపంచకప్ 2021లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.


Click it and Unblock the Notifications
