For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: ‘స్టార్ స్పోర్ట్స్‌’కు రూ. 200 కోట్లు నష్టం!

T20 world cup 2021: Indias early exit to cost Star Rs 200 cr ad revenue

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ వల్ల అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మెగా ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా తొలి పొట్టి కప్పును ముద్దాడింది. అయితే ఈ మెగా టోర్నీ భారత్ కనీసం సెమీస్ కూడా చేరకుండా ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు చేరి ఉంటే టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు ఆడేది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు టీమిండియా ఆడకపోవడంతో స్టార్ స్పోర్ట్స్ సుమారు రూ.200 కోట్ల ఆదాయన్ని నష్టపోయింది. యూఏఈ వేదికగా ముగిసిన ఈ మెగా టోర్నీ ద్వారా రూ. 900 కోట్ల నుంచి రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. కానీ బ్రాడ్ కాస్టింగ్ వర్గాల సమాచారం ప్రకారం, నెట్‌వర్క్ , OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్ సుమారు రూ. 250 కోట్లు సంపాదించింది.

15 నుంచి 20 శాతం..

15 నుంచి 20 శాతం..

అయితే టోర్నమెంట్ నుంచి టీమిండియా నిష్క్రమించడం వల్ల నెట్‌వర్క్ దాని స్పోర్ట్స్ ఛానెల్‌ల ఆదాయంలో 15 నుంచి 20 శాతం వరకు కోల్పోయిందని, మీడియా బ్రాడ్‌కాస్టింగ్ ఎక్స్‌పర్ట్ మదన్ మోహపాత్ర అంచనా వేశారు. ఒకవేళ భారత్ సెమీ-ఫైనల్ , ఫైనల్ ఆడినట్లయితే, అప్పుడు ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగి ఉండేది. బ్రాడ్‌కాస్టర్‌లు సాధారణంగా క్రికెట్ టోర్నమెంట్‌ల కోసం 80-85 శాతం అడ్వర్టైజింగ్ స్లాట్‌లను ముందుగానే బుక్ చేసుకుంటారు. మిగిలిన టోర్నమెంట్ కోసం, మ్యాచ్ వారీగా నిర్ణయం తీసుకుంటారు, తద్వారా వారు మ్యాచ్ ప్రకారం ప్రకటనల రేట్లను పెంచడంపై నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈసారి అది కుదరలేదు.

నిష్క్రమించడంతో..

నిష్క్రమించడంతో..

హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ సెమీస్ చేరతుందని భావించినా స్టార్ ఇండియా భారీ మొత్తంలోనే అడ్వాన్స్‌లు తీసుకుంది. కొన్ని స్లాట్‌లను మరింత ఎక్కువ ధరకు అమ్ముకోవాలని భావించింది. కానీ భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వారి ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. అంతేకాకుండా టీమిండియా నిష్క్రమణతో ఈ టోర్నీని చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 50-70 శాతం మంది ప్రేక్షకులను కోల్పోవాల్సి వచ్చింది. ఇది స్టార్ స్పోర్ట్స్ ఆదాయంపై దెబ్బపడింది.

భారత్-పాక్ మ్యాచ్ రికార్డు వ్యూస్..

భారత్-పాక్ మ్యాచ్ రికార్డు వ్యూస్..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాదాపు రెండేళ్ల తర్వాత దాయాదుల మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు రెండు దేశాల అభిమానులు ఎగబడటంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ట్ స్పోర్ట్స్ పంట పండింది. టీ20 చరిత్రలోనే ఈ మ్యాచ్ హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టింది. రికార్డు స్థాయిలో 167 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు 136 మిలియన్ల వ్యూస్ రాగా.. ఇప్పుడు ఆ రికార్డును భారత్-పాక్ మ్యాచ్‌ బ్రేక్ చేసింది.

ఈ మ్యాచ్‌ మధ్యలో వచ్చే 10 సెకన్ల యాడ్‌కు రూ.25 నుంచి 30 లక్షలు వసూలు చేసింది.

సెమీఫైనల్లో కూడా..

సెమీఫైనల్లో కూడా..

ఇదే క్రమంలో భారత్ సెమీఫైనల్ చేరినా.. మరోసారి భారత్-పాక్ ఫైనల్లో తలపడినా వీలైనంత వసూలు చేయాలని భావించింది. కానీ సెమీఫైనల్‌, ఫైనల్ మ్యాచ్‌లు ఏక పక్షంగా సాగడం.. స్టార్ ఇండియా కొంపముంచింది. హాట్ స్టార్ వ్యూస్ అయితే దారుణంగా పడిపోయాయి. ఏ దశలోనూ ఈ సంఖ్య 50 లక్షలు ధాటలేదు. అదే భారత్- పాక్‌కు కోటిన్నర వ్యూస్ వచ్చాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు రెండు కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే రికార్డు. ఈసారి కూడా భారత్ సెమీస్ చేరితే ఈ రికార్డు బ్రేక్ అవుతుందని స్టార్ ఇండియా ఆశపడింది. కానీ ప్రతీకూల ఫలితాలతో భారత్ నిష్క్రమించడంతో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.

Story first published: Monday, November 15, 2021, 17:29 [IST]
Other articles published on Nov 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+