T20 World Cup 2021: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా రెడీ!

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ భుజ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా కోలుకున్నట్లు తెలుస్తోంది. అతనికి అయిన గాయం చిన్నదేనని, ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. 'మ్యాచ్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా గాయానికి సంబంధించి స్కానింగ్స్ తీయగా.. గాయం చిన్నదేనని తెలింది. తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం మిగిలి ఉండటంతో అప్పటివరకూ కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది.'అని ఆ అధికారి పీటీఐకి తెలిపాడు.

జట్టుకు భారంగా పాండ్యా..
ఇక వెన్నుగాయంతో ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. జట్టు ఫిజియోలు హార్దిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భుజగాయానికి గురవడంతో హార్దిక్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ కూడా చేయలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషనే సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సేవలందించాడు.
భారత ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బరిలోకి దిగిన అతడు భుజం నొప్పి కారణంగా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే (8) పరుగులు చేసి విఫలమయ్యాడు. దాంతో పాండ్యాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గెలవకపోతే కష్టమే..
బ్యాటింగ్, బౌలింగ్ చేయని, ఫిట్‌గా లేని హార్దిక్ పాండ్యా జట్టుకు భారం అయ్యాడని, అతన్ని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే, పాండ్యా మాత్రం ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు నాకౌట్ దశలో బౌలింగ్ చేస్తానని చెప్పాడు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తొలి మ్యాచ్ సందర్భంగా అతనిపై నమ్మకం ఉంచాడు. త్వరలోనే పాండ్యా బౌలింగ్ చేస్తాడని చెప్పాడు. మరోవైపు న్యూజిలాండ్‌తో పోరు టీమిండియాకు కీలకంకానుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే కోహ్లీసేన సెమీస్ చేరడానికి వీలుంటుంది. అక్కడ ఓడితే నాకౌట్ దశకు చేరడం కష్టమే.

పాండ్యా వద్దు ప్లీజ్..
ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకోవద్దని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అతని ప్లేస్‌లో ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. కేవలం బ్యాటింగే పరిమితమైన పాండ్యా జట్టుకు వచ్చే లాభం ఏం లేదని, పైగా అతను ఫామ్‌లో లేడని కామెంట్ చేస్తున్నారు. ఇక టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టే అవకాశాలున్నాయి. శ్రీలంక పర్యటనలోనూ దారుణంగా విఫలమైన పాండ్యా.. ఐపీఎల్‌లోనూ ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications