Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2021: పాకిస్థాన్ ఓటమి తప్పదని అక్తర్‌కు ముందే చెప్పా!

T20 World Cup 2021: Harbhajan Singh says Shoaib Akhtar about upcoming India-Pakistan clash
T20 World Cup : Harbhajan Singh Message To Shoaib Akhtar Before Ind vs Pak Match || Oneindia Telugu

దుబాయ్: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్‌కు ఓటమి తప్పదని ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ముందే చెప్పానని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. మెగా టోర్నీ నేపథ్యంలో తమ మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని భజ్జీ చెప్పుకొచ్చాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత జట్టు చాలా బలంగా ఉందని తెలిపాడు. 'షోయబ్‌ అక్తర్‌కు ఒకటే మాట చెప్పాను... మీరు మాకు మార్గం సుగమం చేస్తారు... మీరు ఆడతారు... కానీ ఓడిపోతారు... మీకు నిరాశ తప్పదు. మా జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. మా వాళ్లు మిమ్మల్ని కచ్చితంగా ఓడిస్తారని అక్తర్‌కు చెప్పాను'అని భజ్జీ పేర్కొన్నాడు.

మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. 7 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లలో భారత జట్టు పాక్‌పై జయభేరి మోగించింది. ఇక చివరిసారిగా 2019 ప్రపంచకప్‌ సందర్భంగా గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌తో తలపడ్డ పాకిస్తాన్‌... 89 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

అక్టోబ‌ర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబ‌ర్ 23 నుంచి సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌ వేదికగా తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పాకిస్థాన్‌‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌‌తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్‌లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.

భారత టీ 20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.
రిజర్వ్‌ ఆటగాళ్లు: శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌

టీ20 ప్రపంచకప్‌: పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌

రిజర్వ్‌ ఆటగాళ్లు- కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

Story first published: Friday, October 15, 2021, 16:47 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+