T20 World Cup 2021: వెస్టిండీస్‌తో మ్యాచ్.. ప్రపంచ నంబర్ వన్‌కు షాక్ ఇవ్వనున్న ఇంగ్లండ్!!

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సందడి ఇప్పటికే ఆరంభం అయింది. మెగా టోర్నీకి సంబందించిన క్వాలిఫైయర్ మ్యాచులు ఒకవైపు, ప్రాక్టీస్ మ్యాచులు మరోవైపు జరుగుతున్నాయి. క్వాలిఫైయర్ మ్యాచుల మాదిరే టాప్ జట్ల మధ్య జరుగుతున్న సన్నాహక మ్యాచులు కూడా జోరుగా సాగుతున్నాయి. విజయం సాధించేందుకే అన్ని జట్లు చూస్తున్నాయి.
ఈ క్రమంలో కొన్ని అగ్రశ్రేణి జట్లకు కూడా ఓటములు తప్పడం లేదు. ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ ఈనెల 23న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్నాహక మ్యాచులలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో పడ్డాయి పలు జట్లు. ఇంగ్లండ్ కూడా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.

యూఏఈలో తడబడుతున్న మలన్
మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్ జట్టును ఓ సమ్యస వేధిస్తోంది. అదే కీలకమైన మూడో స్థానం. మూడో స్థానంలో ఆడుతున్న ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ డేవిడ్ మలన్ వరుసగా విఫలమవుతున్నాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వార్మప్ గేమ్‌లో మలన్ 15 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీమిండియాతో జరిగిన మొదటి మ్యాచులో కూడా అతడు విఫలమయ్యాడు.
మలన్ టీమిండియాపై 18 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అంతకుముందు ఐపీఎల్ 2021లో కూడా పెద్దగా రాణించాలేదు. దాంతో యూఏఈలో అతని ఫామ్ గురించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఆందోళనలో ఉంది. అయితే టీ20 క్రికెట్‌లో మలన్ ఇంగ్లండ్ తరఫున అద్భుతమైన రికార్డు ఉంది. 30 మ్యాచ్‌లలో 139 స్ట్రైక్ రేట్, 43.2 సగటుతో పరుగులు చేశాడు. అయితే యూఏఈలో మాత్రం తడబడుతున్నాడు.

అద్భుతమైన ఫామ్‌లో అలీ
మరోవైపు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ గత సంవత్సర కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అలీ ఆడుతున్నాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి అలీ మూడో స్థానంలో బరిలోకి దిగుతూ చెన్నైకి ఎన్నో విజయాలు అందించాడు. వేగంగా పరుగులు చేస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చాడు.
చెన్నై టైటిల్ కొట్టడంలో అలీ పాత్ర ఎంతో ఉంది. ఇక టీమిండియాతో జరిగిన సన్నాహక మ్యాచులో కూడా అలీ అడగొట్టాడు. కేవలం 20 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు. దాంతో డేవిడ్ మలన్ స్థానంలో అలీని ఆడించాలన్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అలీనే సరైనోడు అని అందరూ అంటున్నారు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ కూడా ఇదే ఆలోచిస్తుందని సమాచారం తెలుస్తోంది.
Ind Vs Pak:టీమిండియాతో మ్యాచుకు ముందు తేలిపోయిన పాక్.. 19 పరుగులను కూడా కాపాడలేకపోయిన కెప్టెన్!!

పటిష్టంగా ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2021 ఇంగ్లండ్ జట్టును ఇయాన్ మోర్గాన్ ముందుండి నడిపించనున్నాడు. మానసిక సమస్యలతో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ లాంటి స్టార్లు ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యారు. వీరు మినహా రెగ్యులర్‌గా టీ20ల్లో ఆడే ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోలతో బ్యాటింగ్ విభాగం.. క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
మొయిన్ అలీ, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్‌లు కూడా ఇంగ్లండ్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈసారి కప్ కొడుతుందని అందరూ అంటున్నారు.

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications