For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: వణికించిన ఒమన్.. గెలుపుతో ఊపిరి పీల్చుకున్న బంగ్లాదేశ్!

T20 World Cup 2021: Bangladesh Defeat Oman By 26 Runs To Stay Alive In Group B

అల్‌ అమెరాట్‌ (ఒమన్‌): టీ20 ప్రపంచకప్ సూపర్ 12 రౌండ్ అవకాశాలను బంగ్లాదేశ్ సజీవంగా నిలుపుకుంది. తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న ఆ జట్టు.. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై కష్టంగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్ బిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 26 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది.
'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' షకీబ్ అల్‌ హసన్ (42, 3/28)తోపాటు ముస్తాఫిజుర్‌ (4/36) నాలుగు వికెట్లతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

షకీబ్ ఆల్‌రౌండ్ షో..

షకీబ్ ఆల్‌రౌండ్ షో..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌ నయీమ్‌ (50 బంతుల్లో3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) అర్ధ శతకం చేయగా.. షకీబ్(29 బంతుల్లో 6 ఫోర్లతో 42) అండగా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్‌ ఖాన్‌ (3/18), ఫయాజ్‌ భట్‌ (3/30) మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఒమన్‌ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో జతిందర్‌ సింగ్‌ (40), కశ్యప్ ప్రజాపతి(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

హైదరాబాద్ కుర్రాడు విఫలం..

హైదరాబాద్ కుర్రాడు విఫలం..

జతీందర్ సింగ్, కశ్యప్ ప్రజాపతి ధనాధన్ బ్యాటింగ్‌తో ఓ దశలో 81/2తో నిలిచిన ఒమన్.. బంగ్లా టైగర్స్‌ను వణికించింది. కానీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్(4/36) నాలుగు వికెట్లతో.. షకీబ్ అల్ హసన్(3/28) మూడు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి బంగ్లాను గెలిపించారు. మెహిదీ హసన్(1/14)కు ఓ వికెట్ దక్కింది. ఒమన్ తరఫున ఆడుతున్న మన హైదరాబాదీ కుర్రాడు సందీప్ గౌడ్(4) దారుణంగా విఫలమయ్యాడు.

నయీమ్ హాఫ్ సెంచరీ..

నయీమ్ హాఫ్ సెంచరీ..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (6), మెహ్దీహసన్‌ (0) వికెట్లను చేజార్చుకుంది. అయితే, మరో ఓపెనర్‌ నయీమ్‌, ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. మరోవై పు షకీబ్ అల్ కూడా బౌండ్రీలతో విరుచుకుపడడంతో 14వ ఓవర్‌లో టీమ్‌ స్కోరు 100కు చేరింది.

అయితే, సింగిల్‌ కోసం తొందరపడిన షకీబ్ అల్‌ను ఆకిబ్‌ డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కడ నుంచి బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొంది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న నయీమ్‌.. ఖలీముల్లా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో ఔటయ్యాడు. కానీ, కెప్టెన్‌ మహ్మదుల్లా (17) టీమ్‌ స్కోరును 150 పరుగులు దాటించాడు.

సంక్షిప్త స్కోర్లు:

సంక్షిప్త స్కోర్లు:

బంగ్లాదేశ్‌:

20 ఓవర్లలో 153 ఆలౌట్‌ (మహ్మద్‌ నయీమ్‌ 64, షకీబ్ అల్ 42; బిలాల్‌ ఖాన్‌ 3/18, ఫయాజ్‌ భట్‌ 3/30);

ఒమన్‌:

20 ఓవర్లలో 127/9 (జతిందర్‌ సింగ్‌ 40, కశ్యప్‌ 21; ముస్తాఫిజుర్‌ 4/36, షకీబ్ అల్ 3/28).

Story first published: Wednesday, October 20, 2021, 7:45 [IST]
Other articles published on Oct 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+