For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: ఒమన్, పపువా ఔట్.. సూపర్ 12కు బంగ్లాదేశ్, స్కాట్లాండ్!

T20 World Cup 2021: Bangladesh and Scotland Qualifies Super 12s
T20 World Cup 2021: Bangladesh, Scotland Qualifies Super 12s || Oneindia Telugu

అల్ అమెరెట్: టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-బి నుంచి సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధించాయి. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్-బి టాపర్‌గా నిలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అకిమ్ ఇల్యాస్(32బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), మహమ్మద్ నదీమ్(21 బంతుల్లో 2 సిక్స్‌లతో 25), కెప్టెన్ జీషన్ మక్సూద్(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. తెలుగు క్రికెటర్ సందీప్ గౌడ్(8 బంతుల్లో 5) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.

స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డావే(3/25) మూడు వికెట్లతో చెలరేగగా.. సఫ్యాన్ షరీఫ్(2/25), మైకేల్ లీస్క్(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన స్కాట్లాండ్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ కైల్ కోట్జెర్(41), రిచీ బెర్రింగ్టన్(31 నాటౌట్) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఖావర్ అలీ, ఫయాజ్ బట్‌లకు చెరొక వికెట్ పడింది. ఈ విజయంతో స్కాట్లాండ్‌లో టోర్నీలో ముందడుగు వేయగా.. ఒమన్ ఇంటిదారి పట్టింది. ఇక మెగా టోర్నీ ప్రధాన లీగ్‌లోకి అర్హత సాధించడం స్కాట్లాండ్‌కు ఇదే తొలిసారి.

అంతకుముందు పపువా న్యూగినియాపై బంగ్లాదేశ్ 84 రన్స్ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ మహ్మదుల్లా(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. షకీబ్ అల్ హసన్(37 బంతుల్లో 3 ఫోర్లతో 46) కీలక పరుగులు చేశాడు. పపువా న్యూగినియా బౌలర్లలో కాబువ మోరియా, డామిన్ రావు, అసద్ వాల రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిమన్ అటల్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పపువా న్యూగినియా 19.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కిప్లిన్ డొరిగా(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు. అతనొక్కడే అజేయంగా నిలవగా.. మిగతా 10 మంది బ్యాట్స్‌మన్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్(4/9) నాలుగు వికెట్లతో పపువా పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సైఫుద్దీన్, టస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. మెహ్‌దీ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో బంగ్లా సగర్వంగా సూపర్ -12 రౌండ్‌‌లోకి అడుగుపెట్టింది.

Story first published: Friday, October 22, 2021, 9:42 [IST]
Other articles published on Oct 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+