T20 World Cup 2021: బాబర్ ఆజామ్ క్రీడాస్పూర్తి.. అంపైర్ ఔటిచ్చినా.. !(వీడియో)

దుబాయ్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్(28) క్యాచ్ ఔట్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించగా.. బాబర్ అతన్ని వెనక్కి పిలిచి బ్యాటింగ్ చేయమని కోరాడు. బాబర్ చేసిన ఈ పనికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు పాక్ కెప్టెన్‌ను కొనియాడుతున్నారు. కెప్టెన్‌గా బాబర్ గొప్ప వ్యక్తితత్వాన్ని చాటుకున్నాడని మెచ్చుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..?
వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా హసన్ అలీ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసిన షాట్ పిచ్ బంతిని హెట్‌మైర్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో హెట్‌మైర్ విఫలమవడంతో బ్యాట్‌ను మిస్సైన బంతి కీపర్ మహమ్మద్ రిజ్వాన్ చేతిలో పడింది. వెంటనే పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంతో షాక్‌కు గురైన హెట్‌మైర్.. బంతి బ్యాట్‌కు తగలలేదని, తన మెడలోని చైన్.. హెల్మెట్ గ్రిల్స్‌కు తాకి సౌండ్ వచ్చిందని సైగలు చేశాడు. రివ్యూకు అవకాశం లేకపోవడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక అంపైర్ తప్పిదాన్ని గుర్తించిన బాబర్ ఆజామ్.. హెట్‌మైర్‌ను బ్యాటింగ్ కొనసాగించాలని కోరాడు. తమ అప్పీల్‌ను వెనక్కు తీసుకుంటామని చెప్పాడు.

భారత్‌తో మ్యాచ్ అయితే..?
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాబర్ ఆజామ్ గొప్ప క్రీడా స్పూర్తిని చాటుకున్నాడని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం వామప్ మ్యాచ్ కావడంతోనే బాబర్ ఇలా చేశాడని, ఇండియాతో మ్యాచ్ అయితే ఇలా చేసేవాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి సూపర్ ఫామ్ కనబర్చిన హెట్‌మైర్‌ను ఎవరూ అలా పిలవరని కామెంట్ చేస్తున్నారు.

బాబర్ సూపర్ ఫిఫ్టీ..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(24 బంతుల్లో 3 ఫోర్లతో 28), క్రిస్ గేల్(30 బంతుల్లో 2 ఫోర్లతో 20), కెప్టెన్ కీరన్ పొలార్డ్(10 బంతుల్లో 5 ఫోర్లతో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌట్ రెండేసి వికెట్లు తీయగా.. ఇమాద్ వసీం ఓ వికెట్ తీశాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(13) విఫలమైనా.. కెప్టెన్ బాబర్ ఆజామ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. బాబర్ ఔటైనా.. షోయబ్ మాలిక్(14 నాటౌట్)తో కలిసి ఫకార్ జమాన్(24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) ధనాధన్ మెరుపులతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

24న హై ఓల్టేజీ మ్యాచ్..
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్ ఈ నెల 24న పాకిస్థాన్‌తో జరగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా అని ఆశగా ఉన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. దాంతో మెగాటోర్నీలో జరిగే మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభం కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా టిక్కెట్లు ఓ గంటలోనే అమ్ముడుపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా.. టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోవడం విశేషం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దాయాదుల పోరుకు ఎంత క్రేజ్ ఉందొ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications