T20 WC 2021: ఓవైపు భారత్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. మరోవైపు వెంటిలేటర్‌పై బాబర్ ఆజామ్ తల్లి! బాధను భరిస్తూనే..

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ దుమ్మురేపుతోంది. కనివినిఎరగని రీతిలో అదరగొడుతుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. తమ అసాధారణ ప్రదర్శనతో ఓ నయా పాకిస్థాన్ టీమ్‌ను తలపిస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. ఒకప్పుడు ఛేదన అంటేనే తడబడిపోయే, ఒత్తిడికి గురయ్యే జట్టుగా పాకిస్థాన్‌కు పేరుండేది. ఒకట్రెండు వికెట్లు పడ్డాయంటే మంచి స్థితి నుంచి ఒకేసారి కుప్పకూలిపోయి మ్యాచ్‌లు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటు. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. భారత్‌పై 150 పైచిలుకు లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్ కోల్పోకుండా ఛేదించడం అనూహ్యం.

బాబర్ ఆజామ్ వల్లే..
భారత బౌలర్లు ఎంతగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా పాక్ ఓపెనర్లు లొంగలేదు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 69 పరుగులకే 4 కీలక వికెట్లు పడ్డా ఆ జట్టు కోలుకుంది. మాలిక్ అండతో అసిఫ్ అలీ చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఛేదనల్లో సమీకరణం తేలిగ్గా ఉన్నప్పటికీ ఒత్తిడికి గురై మ్యాచ్‌లు అప్పగించేసే జట్టు.. టపటపా వికెట్లు పడిపోయి, సాధించాల్సిన రన్‌రేట్ 9 దాటిపోయిన సమయంలో దృఢంగా నిలబడి మ్యాచ్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాకిస్థాన్ ఆటలో ఈ మార్పుకు ప్రధాన కారణం కెప్టెన్ బాబర్ అజామ్ అన్నది విశ్లేషకుల మాట.

బాధను భరిస్తూనే..
అయితే ఆ బాబర్ ఆజామ్ పుట్టెడు దు:ఖాన్ని భరిస్తూనే టోర్నీలో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని తల్లి ప్రస్తుతం వెంటీలేటర్‌పై చికిత్స తీసుకుంటుంది. అయినా బాబర్ తనదైన సారథ్యంతో జట్టుకు విజయాలందిస్తున్నారు. భారత్'-పాకిస్థాన్ మధ్య హై ఓల్టెజ్ మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు అతని తల్లి వెంటీలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుందంట. ఈ విషయాన్ని అతని తండ్రి సిద్దిఖి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తన కొడుకు ఎంతో బాధను భరిస్తూనే మూడు మ్యాచ్‌లు ఆడాడని వెల్లడించాడు.

కారణం లేకుండా విమర్శించవద్దు..
'బాబర్ వెనుకున్న పుట్టెడు దు:ఖం గురించి మా దేశానికి తెలియాలి. మూడు విజయాలు సాధించిన పాక్ జట్టుకు అభినందనలు. ఈ మూడు మ్యాచ్‌ల్లో బాబర్ తీరని బాధను భరిస్తూ బరిలోకి దిగాడు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా మా కుటుంబం విషమ పరీక్షను ఎదుర్కొంది. ఆ మ్యాచ్ సమయంలో బాబర్ తల్లి వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాటం చేసింది. నేను ఈ విషయం చెప్పకపోయేవాడిని కాదు. కానీ బాబర్ బలహీన పడకూడదనే చెబుతున్నా. కారణం లేకుండా నేషనల్ హీరోలను విమర్శించవద్దనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా.'అని ఆయన ఇన్‌స్టాలో ఉర్డూలో రాసుకొచ్చాడు. వారి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

రెండు హాఫ్ సెంచరీలు..
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. బాబర్ ఇంత బాధను భరిస్తూ ఆడుతున్నాడా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత బాధను భరిస్తూనే బాబర్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. న్యూజిలాండ్‌పై విఫలమైనా.. భారత్, అఫ్గానిస్థాన్‌లపై హాఫ్ సెంచరీలతో రాణించాడు. పాక్ తమ తదుపరి మ్యాచ్‌ను నమీబియాతో నవంబర్2న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. చివరి మ్యాచ్‌గా స్కాట్లాండ్‌తో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications