Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2021: ఆకాశ్ చోప్రా బెస్ట్ ఎలెవన్.. భారత ఆటగాళ్లకు నో చాన్స్!

T20 World Cup 2021: Aakash Chopra picks his best XI of the tournament

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోని ఆటగాళ్లు ప్రదర్శన ఆధారంగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అత్యుత్తమ జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో భారత్ నుంచి ఒక్క ఆటగాడికి కూడా అవకాశం దక్కలేదు. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను‌ ఓపెనర్‌గా ఎంపిక చేసిన చోప్రా.. అతనికి జతగా మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తీసుకున్నాడు. సూపర్‌ 12 రౌండ్‌లో ఐదింటికి ఐదు గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఆకాశ్‌ చోప్రా.. అతడు మూడోస్థానంలో మెరుగ్గా ఆడగలడని పేర్కొన్నాడు.

నమీబియా ప్లేయర్‌కు చోటు..

నమీబియా ప్లేయర్‌కు చోటు..

శ్రీలంక సెన్సేషన్ చరిత్ అసలంకను నాలుగో స్థానంలో తీసుకున్న భారత మాజీ ఓపెనర్.. సౌతాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ను ఐదో స్ధానంలో ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ, నబీబియా ప్లేయర్ డేవిడ్ వీజ్‌లను తీసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆడమ్ జంపాను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంచుకున్నాడు.

అతను అత్యుత్తమ స్పిన్నర్‌గా పేర్కొన్నాడు. పేసర్లుగా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, ఆస్ట్రేలియా క్రికెటర్ జోష్ హజెల్ వుడ్, సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్‌లను తీసుకున్నాడు. నమీబియా ప్లేయర్‌కు చోటు కల్పించిన ఆకాశ్ చోప్రా భారత్ నుంచి ఒక్కరిని కూడా తీసుకోకపోవడం గమనార్హం.

చిత్తుగా ఓడటంతో..

చిత్తుగా ఓడటంతో..

ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్ 2021 బరిలోకి దిగిన భారత్.. చిత్తుగా ఓడి కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ వెంటనే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం పసికూనలపై ప్రతాపం చూపించినా.. సెమీస్ చేరే అవకాశం లేకుండా పోయింది.

దాంతో లీగ్ దశలోనే టీమిండియా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. పసికూనలపై చెలరేగినా.. కీలక మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు, బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. దాంతోనే ఆకాశ్ చోప్రాతో పాటు ఐసీసీ కూడా తమ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్స్‌లో భారత ఆటగాళ్లకు చోటు కల్పించలేదు.

 ఆకాశ్‌ చోప్రా బెస్ట్‌ టీ20 వరల్డ్‌కప్‌ ప్లేయింగ్‌ జట్టు ఇదే

ఆకాశ్‌ చోప్రా బెస్ట్‌ టీ20 వరల్డ్‌కప్‌ ప్లేయింగ్‌ జట్టు ఇదే

జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌- ఇంగ్లండ్‌), డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా), బాబర్‌ ఆజమ్‌(కెప్టెన్‌- పాకిస్తాన్‌), చరిత్‌ అసలంక(శ్రీలంక), ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా), మొయిన్‌ అలీ(ఇంగ్లండ్‌), డేవిడ్‌ వీజ్‌(నమీబియా), ఆడం జంపా(ఆస్ట్రేలియా), ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా), అన్రిచ్‌ నోర్ట్జే(దక్షిణాఫ్రికా).

ఐసీసీ బెస్ట్ ఎలెవన్:

ఐసీసీ బెస్ట్ ఎలెవన్:

డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌, బాబర్ ఆజామ్, చరిత్ అసలంక, ఐడెన్ మార్క్‌రమ్‌, మొయిన్ అలీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగా, ఆడమ్ జంపా, షాహీన్ అఫ్రిది (12వ ఆటగాడు).

Story first published: Tuesday, November 16, 2021, 15:16 [IST]
Other articles published on Nov 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+