Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం.. గాయం విషయం దాచిన స్టార్ ఓపెనర్!

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లిన శుభ్‌మన్ గిల్‌ను ఉన్నపలంగా టీమిండియా మేనేజ్‌మెంట్ భారత్‌కు పంపించింది. శుభ్‌మన్ గిల్‌తో పాటు ఆవేశ్ ఖాన్ కూడా భారత్‌కు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే శుభ్‌మన్ గిల్‌ను భారత్‌కు పంపించారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని టీమిండియా బ్యాటింగ్ హెడ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. శుభ్‌మన్ గిల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశాడు.

T20 WC 2024 Shubman Gill carried finger injury since IPL 2024 Report

'శుభ్‌మన్, ఆవేశ్ ఖాన్‌లను వెనక్కు పంపించడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ముందుగా అనుకున్న ప్రణాళికే. భారత జట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టినప్పుడు.. కేవలం ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లని మాత్రమే ఉంచాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

అమెరికాలో ఉన్నప్పుడు నలుగురు ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు ఉండాలని, ఆ తర్వాత కరేబియన్‌కు వెళ్లేటప్పుడు ఇద్దరు ప్లేయర్లని రిలీజ్ చేయాలని భావించాం. ఇప్పుడు ఆ ప్లాన్ ప్రకారమే.. శుభ్‌మన్, అవేశ్‌లను వెనక్కు పంపించడం జరిగింది'అని విక్రమ్ రాథోడ్ వివరణ ఇచ్చాడు.

అయితే తాజాగా శుభ్‌మన్ గిల్ గురించి మరో వార్త బయటకు వచ్చింది. శుభ్‌మన్ గిల్ కుడి చూపుడు వేలుకు ఐపీఎల్ 2024 సీజన్‌లోనే గాయమైందని, ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు చెప్పకుండా దాచాడని తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో శుభ్‌మన్ గిల్ గాయాన్ని గుర్తించిన టీమిండియా ఫిజియోలు వెంటనే ఎన్‌సీఏకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గాయానికి సంబంధించి ఎన్‌సీఏ అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గాయం విషయం చెబితే జట్టుకు దూరమవుతానని భావించి గిల్ ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినట్లు అర్థమవుతోంది. గిల్ చేసిన ఈ పనిపై టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు సెలెక్టర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. గ్రూప్ దశలో భారత్ తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడంతో సూపర్-8కు అర్హత సాధించింది. ఈ సూపర్-8లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ బార్బడోస్ వేదికగా గురువారం (జూన్ 20వ తేదీన) జరగనుంది. అనంతరం జూన్ 22న బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. జూన్ 24న ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిలో గెలుపొందినా.. సెమీ ఫైనల్‌ చేరుకుంటుంది.

Story first published: Wednesday, June 19, 2024, 15:53 [IST]
Other articles published on Jun 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+