Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి కోసం నా ప్రైజ్‌మనీ రూ. 5 కోట్లు వదులుకుంటా: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ ప్రైజమనీలో రూ. 5 కోట్ల చొప్పున 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్‌‌ రాహుల్ ద్రవిడ్‌కు పంచిన బీసీసీఐ.. సపోర్ట్ స్టాఫ్‌కు రూ. రెండున్నర కోట్లు, రిజర్వ్ ప్లేయర్లు, సెలెక్షన్ కమిటీలోని సభ్యులకు రూ కోటి చొప్పున అందజేసింది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు రూ. 2.5 కోట్లు పంచిన బీసీసీఐ.. కండిషనింగ్ కోచ్, ఫిజియోలకు రూ. 2 కోట్ల చొప్పున అందజేసింది. మిగత సపోర్ట్ స్టాఫ్‌కు తక్కువ డబ్బులు దక్కినట్లు తెలుస్తోంది.

T20 WC 2024 Rohit Sharma Ready To Give Up His 5 Crore Bonus From BCCI For Support Staff

అయితే ఈ క్యాష్ ప్రైజ్ పంపిణీ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. తక్కువ అమౌంట్ వచ్చిన సపోర్ట్ స్టాఫ్ కోసం తన రూ. 5 కోట్ల బోనస్‌ను కూడా వదులకునేందుకు సిద్దమయ్యాడని ఓ సపోర్ట్ స్టాఫర్ మీడియాకు తెలియజేశారు.

'ప్రైజ్‌మనీలో సపోర్ట్ స్టాఫ్‌కు అంత తక్కువ డబ్బు రాకూడదు. కావాలంటే నా బోనస్ వదులుకుంటాను. వాటిని సమంగా వారికి పంచండి'అని బీసీసీఐ అధికారులతో రోహిత్ వాదించాడని ఓ సపోర్ట్ స్టాఫర్ మీడియాతో అన్నాడు. రోహిత్ శర్మ చేసిన ఈ పనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్ శర్మది గొప్ప మనుసని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు ప్రైజ్‌మనీలో తన సహాయ సిబ్బందికి ఇచ్చిన మొత్తాన్నే తనకు ఇవ్వాలని బీసీసీఐని రాహుల్ ద్రవిడ్ కోరినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో సమంగా ఇచ్చిన రూ.5 కోట్లను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడని జాతీయ మీడియా పేర్కొంది.

బీసీసీఐ ఇచ్చిన ప్రైజమనీని భారత జట్టులోని 15 మంది సభ్యులు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, సంజు శాంస్, యశస్వీ జైస్వాల్‌కు తలా రూ. ఐదు కోట్లను ప్రకటించారు.

సహాయక కోచ్‌లకు తలో రూ.2.5 కోట్లు, అలాగే ఇతర సహాయక సిబ్బందిగా ఉన్న తొమ్మిది మందికి తలో రూ. 2 కోట్లు ఇవ్వనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు తలా రూ.కోటి అందివ్వనున్నారు.

Story first published: Thursday, July 11, 2024, 12:55 [IST]
Other articles published on Jul 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+