Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: అఫ్గాన్‌తో సూపర్-8 మ్యాచ్.. నలుగురు స్పిన్నర్లతో టీమిండియా!

టీ20 ప్రపంచకప్ 2024లో సమష్టి ప్రదర్శనతో సూపర్ 8 చేరిన టీమిండియా.. గురువారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లను అమెరికా వేదికగా ఆడిన భారత్.. సూపర్ 8 మ్యాచ్‌లను వెస్టిండీస్‌‌లో ఆడనుంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే విండీస్ పిచ్‌లపై టీమిండియా ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఈ క్రమంలో తాజాగా టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర లేపాయి. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో టీమిండియా స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది.

T20 WC 2024 Ravindra Jadeja hints India To Field 4 Spinners For Super 8 Match Vs Afghanistan

అయితే నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం సాహోసోపేత నిర్ణయం. నలుగురు స్పిన్నర్లతో కాంబినేషన్‌తో బరిలోకి దిగితే పేస్ విభాగం బలహీనం కానుంది. కానీ జడేజా వ్యాఖ్యలు మాత్రం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారనే హింట్ ఇస్తున్నాయి.

'వెస్టిండీస్‌లో మేం ఎప్పుడు ఆడినా వికెట్ స్లోగా ఉండటంతో పాటు పోడిగా ఉంటుంది. మ్యాచ్ కూడా ఉదయమే జరగనుంది. కాబట్టి స్పిన్నర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. భారత్‌లో కూడా చాలా పిచ్‌‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలకం కానున్నారు. డెత్ ఓవర్లలో కూడా స్పిన్నర్లతో బౌలింగ్ చేయడం మీరు చూస్తారు.'అని జడేజా స్టార్ స్పోర్ట్స్‌తో చెప్పుకొచ్చాడు.

ఒకవేళ టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే.. సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌‌లపై వేటు వేయాల్సి ఉంటుంది. కానీ రోహిత్ శర్మ ఈ సాహోసోపేత నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అర్ష్‌దీప్ సింగ్ లేదా సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బార్బోడస్ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది.

భారత తుది జట్టు(అంచనా) vs అఫ్గానిస్థాన్:

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

Story first published: Monday, June 17, 2024, 21:56 [IST]
Other articles published on Jun 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+