Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024 Final: టీమిండియా కొంపముంచిన అక్షర్ పటేల్ రనౌట్!(వీడియో)

సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కళ్లు చెదిరే రనౌట్‌తో ఔరా అనిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో శనివారం జరిగిన ఫైనల్లో డికాక్ సూపర్ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.

T20 WC 2024 Final Quinton de Kock s brilliant presence of mind sends Axar Patel back to pavilion

అయితే 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా అక్షర్ పటేల్‌ను అప్‌ది ఆర్డర్ పంపించగా.. అతను కోహ్లీ సాయంతో చెలరేగాడు. భారీ సిక్సర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

72 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని క్వింటన్ డికాక్ సూపర్ ఫీల్డింగ్‌తో విడదీసాడు. డికాక్ స్టన్నింగ్ డెలివరీతో అక్షర్ పటేల్ అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాడు. రబడా వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతి కోహ్లీ ప్యాడ్‌ను తాకి కీపర్ వైపు దూసుకెళ్లింది. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న అక్షర్ పటేల్ క్విక్ సింగిల్ కోసం అప్పటికే హాఫ్ పిచ్ ధాటాడు.

బంతిని డికాక్ అందుకోవడం చూసిన కోహ్లీ సింగిల్‌కు నిరాకరించాడు. దాంతో అక్షర్ పటేల్ యూటర్న్ తీసుకొని లేజీగా పరుగెత్తాడు. బంతిని అందుకున్న క్వింటన్ డికాక్ తెలివిగా నాన్‌స్ట్రైకర్ వికెట్ల వైపు త్రో చేసాడు. ఆ త్రో కాస్త నేరుగా వికెట్లను తాకడంతో అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అతను డైవ్ చేసి ఉంటే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు.

అక్షర్ పటేల్ ఔటవ్వడం టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశాలను దెబ్బతీసింది. క్రీజులో అలవోకగా సిక్స్‌లు బాదిన అక్షర్ పటేల్ కీలక సమయంలో రనౌటవ్వడంతో క్రీజులోకి వచ్చిన బ్యాటర్ స్వేచ్చగా ఆడలేకపోయారు.

Story first published: Saturday, June 29, 2024, 23:01 [IST]
Other articles published on Jun 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+