Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 Rankings: టాప్ లేపిన రవి బిష్ణోయ్.. మూడు ఫార్మాట్లలో టీమిండియాదే అగ్రస్థానం!

T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ దుమ్మురేపాడు. 699 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్ అదిరిపోయే ప్రదర్శన కనబర్చాడు.

5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డ్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపాడు. సీనియర్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏడు స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు.

T20 Rankings: Ravi Bishnoi becomes World No 1 T20I bowler after IND vs AUS T20I series

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 855 రేటింగ్ పాయింట్స్‌తో నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు.

టీమ్ విభాగంలో టీమిండియా 265 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే, టెస్ట్‌ల్లోనూ నెంబర్ వన్ జట్టుగా నిలిచింది.

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను వరుసగా గెలిచిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓటమిపాలైంది.

చివరి రెండు మ్యాచ్‌ల్లో రవి బిష్ణోయ్ సత్తా చాటడంతో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమైంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

సౌతాఫ్రికా పర్యటనలోనూ రవి బిష్ణోయ్ ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం చేసుకోనున్నాడు. జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ టోర్నీ జరగనుంది.

Story first published: Wednesday, December 6, 2023, 15:31 [IST]
Other articles published on Dec 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+